Free Fire : గూగుల్, యాపిల్ ప్లే స్టోర్‌ల నుండి తొలగించబడ్డ ఫ్రీ ఫైర్ గేమ్
Free Fire : ఒకప్పుడు పబ్‌జీ గేమ్‌కి ఎంత మంది బానిసలుగా మారిన విషయం తెలిసిందే. ఈ గేమ్ వలన చాలా మంది మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా స్టూడెంట్స్ తమ జీవితాలని నాశం చేసుకున్నారు. చైనా సరిహద్దుల్లో వివాదం, కరోనా కారణాలతో భారత్ పబ్జీ సహా.. పలు చైనా యాప్ లను నిషేధించింది. ఆ తర్వాత అచ్చం పబ్జీని పోలి ఉండే ఫ్రీ ఫైర్ వచ్చింది. పబ్జీకి బానిసలైన వారంతా ఫ్రీ ఫైర్ కు అడిక్ట్ అయ్యారు. పబ్జీలోని చాలా అంశాలు ఫ్రీ ఫైర్ గేమ్ లోనూ ఉంటాయి. గరెనా సంస్థ ఈ గేమ్ ను భారత్ లోకి తీసుకొచ్చింది. అయితే.. ప్రస్తుతం గూగుల్, యాపిల్ ప్లే స్టోర్లలో ఫ్రీ ఫైర్ కనిపించడం లేదు.
దాంతో ఫ్రీ ఫైర్ ను బ్యాన్ చేశారంటూ వార్తలొస్తున్నాయి.పబ్జీ డెవలపర్ సంస్థ క్రాఫ్టన్ ఇటీవలే గరెనా సంస్థపై లా సూట్ వేసింది. తమ పబ్జీలో ఉన్న చాలా అంశాలను కాపీకొట్టి గరెనా సంస్థ ఫ్రీ ఫైర్ ను రూపొందించిందని, గరెనాకు చెందిన ఫ్రీ ఫైర్ యాప్ ను నిషేధించాలని క్రాఫ్టన్ కోరింది. ఈ క్రమంలోనే గూగుల్, యాపిల్ సంస్థలు తమ ప్లే స్టోర్లలో ఫ్రీ ఫైర్ ను నిషేధించినట్లు తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే గరెనా సంస్థ స్పందించాల్సిందే. కాగా.. ఫ్రీ ఫైర్ ద్వారా గరెనా సంస్థకు 2021లో 414 మిలియన్ డాలర్ల ఆదాయం రాగా.. పబ్జీ ద్వారా క్రాఫ్టన్ కు 639 మిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది.
Free Fire : బ్యాన్ ఎందుకు చేశారో..
ఇటీవల భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా 2021 గూగుల్ ప్లే బెస్ట్ గేమ్స్, యాప్స్ జాబితా విడుదలైంది. ఎంతో ఫేమస్ అయిన, ప్రజల ఆదరణ పొందిన యాప్స్, గేమ్స్ లిస్ట్ ను గూగుల్ విడుదల చేసింది అంఉలో ప్రీ ఫైర్ ఉండడం వివేషం. భారత్‌లో 2021 బెస్ట్ గేమ్ అవార్డును బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా దక్కించుకోగా.. బెస్ట్ యాప్ గా బిట్‌క్లాస్ నిలిచింది. ఇక భారత్‌లో యూజర్ల చాయిస్ విభాగంలో బీజీఎంఐను దాటేసింది గరేనా ఫ్రీఫైర్ మ్యాక్. ఎక్కువ మంది యూజర్లు ఫ్రీఫైర్ కే ఓటేశారు. ఇక యూజర్ల చాయిస్ బెస్ట్ యాప్ గా క్లబ్ హౌస్ అవార్డు దక్కించుకుంది.