Tractor : రైతులకు గుడ్ న్యూస్.. ఆవు పేడతో నడిచే ట్రాక్టర్.. వీడియో
Tractor : దేశవ్యాప్తంగా వ్యవసాయం పెనుబారంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైతులు కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై గత ఏడాది దేశవ్యాప్తంగా నిరసనలు కూడా చేపట్టారు. ఈ క్రమంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ పలు పథకాలు అమలు చేయడం స్టార్ట్ చేశాయి. ఇదిలా ఉంటే వ్యవసాయంలో ట్రాక్టర్ కీలకపాత్ర పోషిస్తుందన్న సంగతి తెలిసిందే. కానీ భారతదేశంలో ఇందన ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఈ పరిణామంతో వ్యవసాయం రంగంలో ట్రాక్టర్ నడపడానికి రైతులు ఆలోచించాల్సిన […]
Tractor : దేశవ్యాప్తంగా వ్యవసాయం పెనుబారంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైతులు కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై గత ఏడాది దేశవ్యాప్తంగా నిరసనలు కూడా చేపట్టారు. ఈ క్రమంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ పలు పథకాలు అమలు చేయడం స్టార్ట్ చేశాయి. ఇదిలా ఉంటే వ్యవసాయంలో ట్రాక్టర్ కీలకపాత్ర పోషిస్తుందన్న సంగతి తెలిసిందే. కానీ భారతదేశంలో ఇందన ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఈ పరిణామంతో వ్యవసాయం రంగంలో ట్రాక్టర్ నడపడానికి రైతులు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి ఇలా ఉంటే డీజిల్, పెట్రోల్ అవసరం లేకుండా ఆవు పేడతో నడిచే ట్రాక్టర్ నీ ఓ విదేశీ కంపెనీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. వ్యవసాయంలో దుక్కి దున్నడం, దమ్ము చేయడం వంటి పనులకు ట్రాక్టర్ కి కొన్ని వందల లీటర్ల పెట్రోల్ మరియు డీజిల్ పోయాల్సి ఉంటుంది.
దీంతో రైతుకి ఖర్చు పెరిగిపోతూ..డబ్బులు ఏమి మిగిలే పరిస్థితి ఉండటం లేదు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని విదేశాలకు చెందిన శాస్త్రవేత్తలు పెట్రోల్.. డీజిల్ కి ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొన్నారు. సొంత పొలాలలో మరియు పశువుల దొడ్డిలో దొరికే ఆవు పేడతో నడిచేలా ట్రాక్టర్ రూపొందించారు. ఇటలీ దేశానికి చెందిన “న్యూ హోలాండ్ అగ్రికల్చర్” అనే వ్యవసాయ యంత్రాలను తయారు చేసే కంపెనీ.. ఈ ప్రయోగం చేసి సక్సెస్ అయ్యింది. లిక్విడ్ మీథేన్ గ్యాస్ తో నడిచే టి 7 మోడల్ ట్రాక్టర్ నీ రైతుల కోసం తయారుచేసినట్లు కంపెనీ చెప్పుకొచ్చింది. వ్యవసాయ క్షేత్రంలో దొరికే ఆవుపేడతో 270 బిహెచ్పి సామర్థ్యంతో.. ట్రాక్టర్ నడుస్తుందని స్టాండర్డ్ డీజిల్ తో నడిచే ట్రాక్టర్ల కంటే.. అద్భుతంగా పనిచేస్తుందని కంపెనీ స్పష్టం చేయడం జరిగింది.
ఆవు నుండి వచ్చే ఫ్యూజిటివ్ గ్యాస్… విందనంగా కంప్రెస్ చేసి దానిని ఒక క్రయోజనిక్ ట్యాంక్ లో నింపి ట్రాక్టర్ కి ఆ ట్యాంకు కనెక్ట్ చేసి.. నడుపుకోవచ్చని కంపెనీ చెప్పుకోచ్చింది. డీజిల్ వాహనం కంటే ఫ్యూజిటివ్ మెథన్ గ్యాస్ ట్రాక్టర్ సమర్థవంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఈ మీథేన్ ట్రాక్టర్లను ఎగుమతి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. భారతదేశంలో దాదాపు 60 శాతానికి పైగా జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవించే వాళ్ళు. దీంతో ఈ ట్రాక్టర్ భారత్ లో కూడా అడుగుపెడితే ప్రభుత్వ సబ్సిడీ ద్వారా రైతులకు అందజేస్తే వారి పంట పండుతుందని ఈ వార్తపై కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఇక పెట్రోల్, డీజిల్ అవసరతలు రైతులకు ఉండవని చెప్పుకొస్తున్నారు.