land Issue : భూ వివాదంతో 8 సార్లు ట్రాక్టర్ తో తొక్కించి చంపిన దుండగుడు.. వీడియో !! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

land Issue : భూ వివాదంతో 8 సార్లు ట్రాక్టర్ తో తొక్కించి చంపిన దుండగుడు.. వీడియో !!

 Authored By aruna | The Telugu News | Updated on :26 October 2023,6:00 pm

ప్రధానాంశాలు:

  •  రాజస్థాన్ లో ఘోర ఘటన

  •  భూ వివాదంతో 8 సార్లు ట్రాక్టర్ తో తొక్కించి చంపిన దుండగుడు

  •  భూమి వివాదంలో ఒకరి ప్రాణాలు పోయాయి

land Issue : మనుషుల్లో మానవత్వం అనేది లేకుండా పోతుంది. తమ స్వార్థం కోసం ఇతరులను మోసం చేయటమే కాకుండా చివరికి వారి ప్రాణాలను కూడా తీస్తున్నారు. రక్తం పంచుకొని పుట్టిన తోబుట్టువులు కూడా ఆస్తుల కోసం గొడవలు పెట్టుకుని చివరికి విడిపోవడమే కాకుండా ప్రాణాలు కూడా తీసేసుకుంటున్నారు. సాటి మనిషి అనే మానవత్వం లేకుండా ఆవేశంతో అత్యంత కిరాతకంగా చంపేస్తున్నారు. తాజాగా రాజస్థాన్ లో జరిగిన ఓ ఘటనకు సంబంధించి వీడియో చూస్తే మానవత్వం అనేది ఆ మనిషికి కొంచెం కూడా లేదు అనిపిస్తుంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రాజస్థాన్లో ఓ గ్రామానికి చెందిన రైతులు భూమి వివాదంలో చివరికి ఒకరి ప్రాణాలు పోయాయి. ఒక రైతు అత్యంత దారుణంగా తన ట్రాక్టర్ తో మరొక రైతును ఎనిమిది సార్లు తొక్కించి అత్యంత కిరాతకంగా చంపాడు. భూ వివాదంలో గొడవలు అనేవి వస్తుంటాయి. అవన్నీ కూర్చొని పెద్దల సమక్షంలో మాట్లాడాల్సింది పోయి ఆ వ్యక్తి మరో రైతును అత్యంత దారుణంగా ట్రాక్టర్ కింద తొక్కి చంపేశాడు. మనుషులు ఇంత దారుణంగా ఉంటారా అని ఈ వీడియో చూసిన నెటిజన్స్ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇలాంటి అమానుష ఘటనపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేశారు. ప్రస్తుత కాలంలో ప్రేమానుబంధాలు లేవు, ఎవరి స్వార్థం వారిది, సాటి మనిషిని ఇంత దారుణంగా చంపిన అతడిని చూసి సభ్య సమాజం తలదించుకుంటుంది అని కామెంట్ లు చేశారు. మరికొందరు ఆ ట్రాక్టర్ తో ఆ వ్యక్తిని అలా తొక్కిస్తుంటే అక్కడ చూస్తున్న వాళ్లు ఆ వ్యక్తిని ట్రాక్టర్ కింద నుంచి లాగ వచ్చు కదా అని, చుట్టూ అంత మంది ఉన్నారు ఒక్క వ్యక్తిని కాపాడలేకపోయారు అని మరికొందరు తమ ఆవేదనను కామెంట్ల ద్వారా వ్యక్తం చేశారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది