Tamarind Seeds : చింతగింజలను తింటున్నారా? అయితే వెంటనే ఇది చదవండి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tamarind Seeds : చింతగింజలను తింటున్నారా? అయితే వెంటనే ఇది చదవండి?

 Authored By jagadesh | The Telugu News | Updated on :24 March 2021,11:42 am

Tamarind Seeds : చింత పండు ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. వంటింట్లో చింతపండు లేనిదే రోజు గడవదు. ఎన్ని కూరలు వండినా.. ఎన్ని వెరైటీలు ఉన్నా… ఇంత చారు ఉంటే.. ఆ టేస్టే వేరు. చారు ప్రత్యేకత అదే. ఏ చారు చేయాలన్నా… దానికి కావాల్సింది చింత పండు. టేస్టుకు టేస్టు… ఆరోగ్యానికి ఆరోగ్యం. అందుకే.. చాలామంది చింతపండును ఇష్టంగా తింటారు. చింతపండులో ఉండే… టార్టారిక్ యాసిడ్, ఫైటో న్యూట్రియెంట్స్ వల్ల ఫ్రీ రాడికల్స్ నాశనం అవుతాయి.

health benefits of tamarind seeds

health benefits of tamarind seeds

మలబద్ధకం సమస్యలు ఉన్నా…. జీర్ణ వ్యవస్థలో సమస్యలు ఉన్నా… చింతపండులో ఉండే ఫైబర్ వల్ల ఇవన్నీ తొలిగిపోతాయి. అలాగే.. చింతపండు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. చింతపండులో ఉండే పొటాషియం.. శరీరంలో ఉండే నార్మల్ ఫ్లూయెడ్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది.

ఇలా… చింతపండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే… చాలామంది కేవలం చింతపండును మాత్రమే ఆహారంలో ఉపయోగిస్తారు కానీ.. చింతగింజలను పక్కన పడేస్తారు. నిజానికి.. చింతపండు కంటే.. ఎక్కువ పోషకాలు ఉండేది చింతగింజల్లోనే.

Tamarind Seeds : చింతగింజల్లో ఏముంటుంది?

చింత గింజలను పొడి చేసి.. చిగుళ్ల మీద.. పళ్ల కింద రుద్దితే పళ్లలో ఏర్పడే సందులు కానీ… తుప్పుపట్టిన పళ్లు కానీ తెల్లగా మెరుస్తాయి.. పంటి నొప్పి ఉన్నా కూడా చింత గింజల పొడి వల్ల పోతుంది. చిగుళ్లు కూడా దృఢంగా తయారవుతాయి.

జీర్ణ వ్యవస్థ మెరుగుపడటం కోసం, వంట్లో ఉన్న చెడు కొలెస్టరాల్ ను తగ్గించుకోవడం కోసం… చింత గింజల రసాన్ని వాడితే బెటర్.

చింతగింజలు నానబెట్టిన నీటిని తాగితే…. బ్లడ్ షుగర్ లేవల్స్ నార్మల్ అవుతాయి. అంటే… సహజసిద్ధంగా షుగల్ లేవల్స్ ను చింత గింజల నీటి వల్ల కంట్రోల్ చేసుకోవచ్చు. చింత గింజలు షుగర్ లేవల్స్ ను కంట్రోల్ చేసే పాంక్రియాస్ ను రక్షిస్తాయి. దీంతో షుగర్ లేవల్స్ కూడా నార్మల్ లేవల్ కు వస్తాయి.

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది