Taj Mahal : అసలు సిమెంట్ లేని రోజుల్లో తాజ్ మహల్ ను ఎలా కట్టారు ? దేనితో కట్టారో తెలుసా?
Taj Mahal : నేడు దేన్ని కట్టాలన్నా సిమెంట్ కంపల్సరీ. సిమెంట్ లేకుండా ఏ కట్టడాన్ని కూడా కట్టలేం. చిన్న ఇల్లు కట్టాలన్నా కూడా సిమెంట్ కావాల్సిందే. కానీ.. సిమెంట్ ను 1824 లో ఇంగ్లండ్ కు చెందిన ఓ వ్యక్తి కనిపెట్టాడు. అంటే 1824 కంటే ముందు సిమెంట్ లేదన్న మాట కానీ.. అంతకు ముందు కట్టిన ఎన్నో కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. వాటిలో ఒకటి తాజ్ మహల్.తాజ్ మహల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచంలోని ఏడు వింతల్లో తాజ్ మహల్ ఒకటి. దాన్ని కట్టి ఇప్పటికి 400 ఏళ్లు దాటింది. 400 ఏళ్లు దాటినా కూడా ఇప్పటికీ అది చెక్కు చెదరకుండా ఎలా ఉంది? అసలు..
సిమెంటే లేని రోజుల్లో తాజ్ మహల్ ను ఎలా నిర్మించారు? దేనితో నిర్మించారు? సిమెంట్ లేకున్నా.. కట్టడాలు నిర్మించవచ్చా? అది ఎలా సాధ్యం? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి.తాజ్ మహల్ ను 1631 వ సంవత్సరంలో నిర్మించడం మొదలు పెట్టారు. కనీసం 18 సంవత్సరాల పాటు ఆ కట్టడాన్ని నిర్మించడం కోసం కష్టపడ్డారు. 1648 లో తాజ్ మహల్ నిర్మాణం పూర్తయింది. సిమెంట్ లేకున్నా.. అప్పటి మేస్త్రీలు ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని తయారు చేసి కట్టాల్లో ఉపయోగించేవాళ్లు.
Taj Mahal : సిమెంట్ లేకున్నా.. తాజ్ మహల్ ను దేనితో కట్టారంటే?
దాన్ని పేస్ట్ లా చేసి కట్టడాలను కట్టేవారు.ఆ పేస్ట్ ను మొలాసిస్, బటాసే, బెల్గెటే నీరె, పప్పులు, జనపనార, కంకరతో పాటు ఇంకా ఇతర పదార్థాలను కలిపి ఈ పేస్ట్ ను తయారు చేసేవారు.ఇందులో కొన్ని కెమికల్ పదార్థాలు కూడా ఉండేవి. వీటన్నింటితో చేసిన మిశ్రమాన్ని సిమెంట్ బదులుగా కట్టడాల్లో ఉపయోగించేవారు.ఈ మిశ్రమం.. సిమెంట్ కన్నా.. ఎంతో ధృడంగా ఉండేది. తాజ్ మహల్ మాత్రమే కాదు.. అలాంటి ఎన్నో కట్టడాలకు ఆ మిశ్రమాన్నే ఉపయోగించారు. అందుకే.. తాజ్ మహల్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది.