Students psychology : ఎగ్జాం హాలు సీలింగ్ ఎత్తు.. పరీక్షల రాసే స్టూడెంట్స్ మీద ఎఫెక్ట్.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు..!
ప్రధానాంశాలు:
Students psychology : ఎగ్జాం హాలు సీలింగ్ ఎత్తు.. పరీక్షల రాసే స్టూడెంట్స్ మీద ఎఫెక్ట్.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు..!
Students psychology : పరీక్షలు రాసే విద్యార్ధుల మీద ఆ ఎగ్జాం హాలు యొక్క సీలింగ్ ఎత్తుగా ఉంటే అది వారి మీద ఎఫెక్ట్ పడేలా చేస్తుందని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా, డీకిన్ యూనివర్సిటీ కలిసి చేసిన అధ్యయనంలో వెల్లడైంది. పరీక్ష రాసే విద్యార్ధులు అసలే కాస్త ఒత్తిడిలో ఉంటారు. ఐతే ఆ టైం లో పరీక్ష హాలు సీలింగ్ ఎత్తులో ఉంటే ఆ ఆర్కిటెక్ వల్ల విద్యార్ధులు సరిగా పరీక్ష రాయలేరని అంటున్నారు.
ఈ పరిశోధన దాదాపు ఎనిమిదేళ్లుగా వారు చేస్తున్నారు. మొత్త ఒక యూనివర్సిటీ క్యాంపస్ లో ఉన్న 15400 మందికి పైగా అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ మీద ఈ పరిశీలణ నిర్వహించారట. ఐతే హాలు సీలింగ్ ఎక్కువ ఎత్తులో ఉంటే విద్యార్ధుల విద్యా, సామాజిక స్థితి, లింగం, వయస్సు తో ముడిపడి పరీక్ష రాసే టైం లో వింత అనుభవాలను పరిగణలోకి వస్తాయట.వర్చువల్ రియాలిటె టెస్ట్ ద్వారా తేలింది ఏంటంటే ఆ ఎత్తైన సీలింగ్ వల్ల సౌండ్, టెంపరేచర్ లో మార్పులు విద్యార్ధి మానసిక స్థితిపై పడుతుందని చెబుతున్నారు.
Students psychology ఏకాగ్రత కుదరదు, గాలి కూడా ఆడని పరిస్థితి
ఒక పెద్ద హాలు లో ఎక్కువ మంది విద్యార్ధులు పడతారని అలా ఎత్తైన సీలింగ్ ఉన్న హాలు లో పరీక్షలు పెడితే దాని వల్ల అక్కడ గాలి సరిపోదు. దాని వల్ల పరీక్ష రాసే విద్యార్ధుల ఏకాగ్రత కూడా భగం అవుతుందని ఈ అధ్యయనం వల్ల తేలింది. ఒకటి మాములు గదిలో పరీక్ష నిర్వహించిన వారి కన్నా ఎత్తైన సీలింగ్ ఉన్న వారిలో కాస్త ఒత్తిడి ఉంటుందని వారు కనిపెట్టారు.సో యూనివర్సిటీ లేదా కాలేజ్ ఎలాంటి ప్రిమిసెస్ లో అయినా పరీక్షలు నిర్వహిస్తే క్లాస్ లేదా చిన్న రూం లు తప్ప సెమినార్ హాలుని పరీక్షలకు వాడితే దాని వల్ల విద్యార్దులు ఎంత చదివినా ఆ రూం ఎఫెక్ట్ వారి మీద పడి సరైన విధంగా పరీక్షలు రాయలేరని తెలుస్తుంది.