Aadhar Card : మీకు ఆధార్ కార్డ్ ఉంటే ఇదిగో ఇలా 50000 పొందే ఛాన్స్ మీదే..!
ప్రధానాంశాలు:
Aadhar Card : మీకు ఆధార్ కార్డ్ ఉంటే ఇదిగో ఇలా 50000 పొందే ఛాన్స్ మీదే..!
Aadhar Card : మన దగ్గర ఆధార్ ఒక్కటి ఉంటే చాలు కేంద్రం నుంచి కొన్ని స్కీంస్ వర్తిస్తాయి. వాటి వివరాలు మనకు తెలియకపోవడం వల్ల ఆ లబ్ది పొందకుండా అవుతుంది. లేటెస్ట్ గా అలాంటిది ఒకటి ప్రవేశ పెట్టారు. ప్రధాన మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నివాస్ ఫండ్ పేరిట అంటే పీఎం స్వనిధి యోజన్ కింద ఒక పథకం ప్రవేశ పెట్టారు. భారత ప్రభుత్వం ఈ పథకం కోవిడ్ 19 ద్వారా నష్టపోయిన వ్యాపారులకు, వీధి వ్యాపారులకి ఆర్ధ్క సాయం చేసేలా ప్రవేశ పెట్టింది. ఈ పథకంతో తక్కువ వడ్డీతో రుణాలు పొందే అవకాశం ఉంటుంది. దాని వల్ల వారు తమ వ్యాపారాలను తిరిగి పునరుద్ధరించుకునే అవకాశం ఉంటుంది.
పీఎం స్వనిధి యోజన్ ద్వారా ద్వారా ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నా సరే లేదా పేదరికంలో ఉన్న వ్యాపారులకు తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కావాల్సిన ఆర్ధిక మొత్తాన్ని పొందవచ్చు. ఈ పథకం ద్వారా వీధి వ్యాపారాలు, చిన్నపాటి బిజినెస్ యజమానులు మరియు ఇతర చిన్న తరహా వ్యాపారాలకు తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తారు. ఐతే ఈ రుణాలను వారు నెలవారీ తక్కువ వాయిదాల్లో ఈ.ఎం.ఐ ల రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం చిరు వ్యాపారులకు ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగించి భద్రత ఏర్పరుస్తుంది.
Aadhar Card గ్యారెంటీ లేకుండా రుణాలు..
స్వనిధి యోజన్ కింద రుణాలు పొందాలంటే ఎలాంటి గ్యారెంటీ అవసరం లేదు. ఫస్ట్ టర్మ్ లో 10000 దాకా రుణం పొందే అవకాశం ఉంటుంది. ఈ రుణాన్ని సకాలంలో చెల్లిస్తే రుణ పరిమితి పెంచి తర్వాత 20000 దాకా ఇస్తారు. 3వ దశలో 50000 దాకా వస్తుంది. చిరు వ్యాపారులకు సాయం చేసేలా ఈ స్కీం రూపొందించబడింది. ఈ రుణాన్ని పొందాలంటే ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది.
ఐతే ఈ రుణాలు తీసుకుని రుణాలు చెల్లించడంలో విఫలమవుతారో వారు ఈ పథకం కింద తర్వాత ఇంక రుణాలు పొందలేదు. 18 నుంచి 60 ఏళ్ల వరకు ఈ రుణాలు పొందే అవకాశం ఉంటుంది. తక్క్వ వడ్డీతో సరళమైన వాయిదాల్లో ఈ రుణాలు అందిస్తారు. ఈ రుణాలు పొందాలంటే మీకు దగ్గర్లో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాక్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ను బట్టి ఈ రుణాలు అందచేస్తరు.