Aadhar Card New Rules : ఆధార్ కార్డు అప్‌డేట్ రూల్స్.. తెలుసుకోకపోతే మీకే నష్టం..!
ప్రధానాంశాలు:
మారిన ఆధార్ కార్డు రూల్స్
Aadhar Card New Rules : ఆధార్ కార్డు అప్‌డేట్ రూల్స్.. తెలుసుకోకపోతే మీకే నష్టం..!
Aadhar Card New Rules : ఆధార్ కార్డు అప్‌డేట్ చేయాలనుకునే వారి కోసం కేంద్ర ప్రభుత్వం తాజా నిబంధనలు ప్రకటించింది. పాత ఆధార్ కార్డులో ఫోటో, చిరునామా, ఇతర వివరాలను మార్చాలన్నా లేదా కొత్త ఆధార్ కార్డు పొందాలన్నా ఈ నూతన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. యూఐడీఏఐ (UIDAI) 2025–26 సంవత్సరానికి అవసరమైన డాక్యుమెంట్ల జాబితాను విడుదల చేసింది. ఇప్పటి వరకు సులభంగా మార్పులు చేసుకునే అవకాశముండగా, ఇకపై నిర్దిష్ట ఆధారాలు లేకుండా అప్‌డేట్ చేయడం సాధ్యం కాదు.

Aadhar Card New Rules : ఆధార్ కార్డు అప్‌డేట్ రూల్స్.. తెలుసుకోకపోతే మీకే నష్టం..!
Aadhar Card New Rules : మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేయాలనీ అనుకుంటున్నారా..? అయితే ఈ రూల్స్ తెలుసుకోవాల్సిందే !!
ప్రస్తుతం ఆధార్ అప్‌డేట్ కోసం నాలుగు ప్రధాన డాక్యుమెంట్లు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. వ్యక్తిగత గుర్తింపు కోసం పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వ గుర్తింపు కార్డు లేదా కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారుల ఐడీ కార్డు ఉంటే సరిపోతుంది. చిరునామా ధృవీకరణకు విద్యుత్ బిల్లు, వాటర్ బిల్లు, గ్యాస్ బిల్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్, రేషన్ కార్డు, రెంటల్ అగ్రిమెంట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ వంటి ఆధారాలు తప్పనిసరిగా అవసరం.
పుట్టిన తేదీ కోసం స్కూల్ మార్క్ షీట్, పాస్‌పోర్ట్, పెన్షన్ డాక్యుమెంట్ లేదా ప్రభుత్వాలు జారీ చేసే జనన ధృవపత్రం అందించాలి. భారతీయులతో పాటు ఎన్ఆర్ఐలు, విదేశీయులు (దీర్ఘకాలిక వీసాతో ఉన్నవారు), ఐదేళ్లు పైబడిన పిల్లలు కూడా ఆధార్ కార్డు కోసం ఈ డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకోవచ్చు. 2026 జూన్ 14 వరకు ఆధార్ అప్‌డేట్‌ను ఉచితంగా ఆన్‌లైన్‌లో చేయవచ్చు. ఈ గడువు తర్వాత ఫీజుతో ఆధార్ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.