Mynampally Hanumantha Rao : ఆ తప్పు వల్లే మైనంపల్లి హనుమంత రావు ఓటమి పాలయ్యారా..??
ప్రధానాంశాలు:
Mynampally Hanumantha Rao : ఆ తప్పు వల్లే మైనంపల్లి హనుమంతరావు ఓటమి పాలయ్యారా..??
Mynampally Hanumantha Rao : తెలంగాణ ఎన్నికల్లో కొన్ని చోట్ల తప్ప మిగిలిన అన్నిచోట్ల చాలావరకు నియోజకవర్గాలలో కాంగ్రెస్ హవా బాగా కనిపించింది. ఎన్నికలకు ముందు జరిపిన సర్వే కాంగ్రెస్ కు ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని తెలియజేశాయి. కానీ అప్పుడు ఆ విషయాలను ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. మరి ముఖ్యంగా ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ పరిగణలోకి తీసుకోలేదు. అందుకే ఎన్నికల అనంతరం రిజల్ట్స్ రూపంలో భారీ మూల్యం చెల్లించుకున్నాడు. కాంగ్రెస్ హవా ఎంత ఉన్నప్పటికీ కచ్చితంగా గెలుస్తారు అని భావించిన కొందరి అభ్యర్థుల ఫలితాలు తారుమారవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న వారు కూడా ఈసారి ఓటమిని చవిచూశారు.
ఇలాంటి వారిలో మైనంపల్లి హనుమంతరావు ఒకరిని చెప్పాలి. ఈయన 2018 ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గం నుండి గెలిచి టిఆర్ఎస్ జండాను ఎగరవేశాడు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు దాదాపు టికెట్లు ప్రకటించిన కేసీఆర్ ఈసారి మైనంపల్లి కి కూడా టికెట్ ఇచ్చాడు. అయితే ఈసారి కొడుకుని ప్రోత్సహించాలి అని భావించిన మైనంపల్లి తన కొడుకుకు మెదక్ టికెట్ ఇవ్వాల్సిందిగా కేసీఆర్ ను కోరాడు. అయితే అతని కోరికను కేసీఆర్ నిరాకరించడంతో మంత్రి హరీష్ రావు పై తీవ్ర విమర్శలు కురిపించి కొడుకుతో సహా కాంగ్రెస్ జెండాను పట్టుకున్నాడు మైనంపల్లి హనుమంతరావు.
మల్కాజిగిరి నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న మైనంపల్లి హనుమంతరావు సడన్ గా బిఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీకి వెళ్లిపోవడంతో చివరి నిమిషంలో మల్కాజిగిరి టికెట్ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కి ఇప్పించారు. అయితే ఎవరు ఊహించని విధంగా రాజశేఖర్ రెడ్డి అక్కడ విజయం సాధించారు. దీంతో మైనంపల్లి హనుమంతరావు ఓటమిపాలయ్యారు. ఆయన కొడుకు మెదక్ నుండి పోటీ చేసి విజయం సాధించాడు. ఇక్కడ కొడుకైతే గెలిచాడు గానీ ఇంత పట్టు పట్టిన తండ్రి మాత్రం ఓడిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరి ఓటమిపాలయ్యారు అదే టిఆర్ఎస్ లో ఉంటే కచ్చితంగా గెలిచేవారేమో.