Vajresh Yadav : ఇందిరమ్మ రాజ్యంలో నెరవేరిన పేదల సొంతింటి కల వజ్రేష్ యాదవ్
ప్రధానాంశాలు:
Vajresh Yadav : ఇందిరమ్మ రాజ్యంలో నెరవేరిన పేదల సొంతింటి కల వజ్రేష్ యాదవ్
Vajresh Yadav : ఇందిరమ్మ రాజ్యంలోనే పేదల సొంతింటి కల నెరవేరుతుందని మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి తోటకూర వజ్రష్ యాదవ్ అన్నారు.పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14 వ డివిజన్లో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో ప్రతీ ఒక్క పేదవాడు సంతోషంగా ఉండేలా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు.

Vajresh Yadav : ఇందిరమ్మ రాజ్యంలో నెరవేరిన పేదల సొంతింటి కల వజ్రేష్ యాదవ్
నాడు గరీబి హటావో నినాదంతో పేదల ఆర్థిక ప్రగతి కోసం ఇందిరా గాంధీ ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాలే నేటికీ ఆదర్శంగా నిలిచాయని అన్నారు.నేడు తెలంగాణ రాష్ట్రంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని అన్నారు నిబంధనల ప్రకారం ఇండ్లను త్వరగా నిర్మించుకుని బిల్లులు తీసుకోవాలని లబ్దిదారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు తుంగతుర్తి రవి, మాజీ మేయర్ అమర్ సింగ్, మాజీ డిప్యూటీ మేయర్ శివ గౌడ్, మాజీ గ్రంథాలయం చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి పన్నుల శ్రీనివాస్ రెడ్డి, 14 వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బుచ్చి యాదవ్,మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కనకదుర్గ,మాజీ కార్పొరేటర్లు,మాజీ ప్రజా ప్రతినిధులు,యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు