Karivepaku Karam Podi Recipe : కరివేపాకుతో కారం పొడి… వేడి వేడి అన్నంలో టేస్ట్ అదుర్స్… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karivepaku Karam Podi Recipe : కరివేపాకుతో కారం పొడి… వేడి వేడి అన్నంలో టేస్ట్ అదుర్స్…

 Authored By anusha | The Telugu News | Updated on :27 June 2022,8:20 am

Karivepaku Karam Podi Recipe : కరివేపాకు తింటే మన ఆరోగ్యానికి చాలా లాభాలు ఉన్నాయి. అలాగే కరివేపాకును కూరలలో ఎక్కువగా వాడుతారు. కానీ కొంతమంది కరివేపాకులను తీసి పక్కన పెట్టి తింటారు. అలాంటప్పుడు కరివేపాకు తో కారంపొడి చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాకుండా కరివేపాకు కారం పొడి ఎంతో రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ కారం పొడి ని తిన్నారంటే ఆ రుచిని మాటల్లో చెప్పలేం. అలాగే ఈ కారంపొడిలో వేడి వేడి ఇడ్లీలు నంచుకుని తింటే ఎంతో రుచిగా ఉంటాయి. కరివేపాకు కారం పొడి తింటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది. అయితే ఇప్పుడు కరివేపాకు కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

కావలసిన పదార్థాలు :1) కరివేపాకులు 2) ఎండుమిర్చి 3) ధనియాలు 4 వెల్లుల్లి 5) ఆయిల్ 5) పచ్చి శనగపప్పు 6) మినప గుండ్లు 8) జీలకర్ర 9) మెంతులు 10) పసుపు 11) ఇంగువ 12) చింతపండు 13) ఉప్పు తయారీ విధానం : ముందుగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయ్యాక అందులో ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినప గుండ్లు వేసుకొని దోరగా వేయించుకోవాలి. తరువాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి రెండు నిమిషాల పాటు వేయించుకొని తరువాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకోవాలి. తరువాత కారానికి తగ్గ పది, పదిహేను ఎండు మిరపకాయలను వేసుకొని వేయించుకోవాలి. తరువాత పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి.

Karivepaku Karam Podi Recipe In Telugu video

Karivepaku Karam Podi Recipe In Telugu video

తరువాత శుభ్రంగా కడుక్కొని, ఆరబెట్టుకున్న కరివేపాకులను వేసి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పది వెల్లుల్లి రెబ్బలను వేసి మిక్సీ పట్టుకొని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. తరువాత చల్లారిన దినుసులు అన్నింటిని అదే మిక్సీ జార్ లో కి వేసుకొని కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న ఎల్లిపాయలను వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన కరివేపాకు కారం పొడి రెడీ.. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

Also read

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది