Andhra Pradesh – Telangana : రాజకీయ ముంపులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Andhra Pradesh – Telangana : రాజకీయ ముంపులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.!

Andhra Pradesh – Telangana : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కనీ వినీ ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తాయి. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు తోడు, ఎగువన కురిసిన వర్షాలతో గోదావరి నదిపై ప్రాజెక్టులు నిండిపోయాయి.. ఊళ్ళ మీద పడ్డాయి వరద జలాలు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ముంపు ప్రాంతాలు కొన్నాళ్ళకు తేరుకుంటాయి. అది సాధారణ, సహజమైన వరద గనుక. కానీ, రాజకీయ వరద మాటేమిటి.? తెలుగు రాష్ట్రాలు రెండూ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :20 July 2022,6:00 am

Andhra Pradesh – Telangana : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కనీ వినీ ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తాయి. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు తోడు, ఎగువన కురిసిన వర్షాలతో గోదావరి నదిపై ప్రాజెక్టులు నిండిపోయాయి.. ఊళ్ళ మీద పడ్డాయి వరద జలాలు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ముంపు ప్రాంతాలు కొన్నాళ్ళకు తేరుకుంటాయి. అది సాధారణ, సహజమైన వరద గనుక.

కానీ, రాజకీయ వరద మాటేమిటి.? తెలుగు రాష్ట్రాలు రెండూ ఇప్పుడు రాజకీయ వరదలో మునిగి తేలుతున్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, ‘ముంపు మండలాల’ పేరుతో కొంత భూభాగం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదనంగా వెళ్ళింది. అది కూడా, చాలా ఏళ్ళ క్రితం ఆంధ్ర రాష్ట్రంలో అంతర్భాగంగా వున్న ప్రాంతమే. పోలవరం ప్రాజెక్టు వల్లనే ఇప్పుడు ఆయా ముంపు ప్రాంతాలు నీట మునిగాయని తెలంగాణ రాష్ట్ర సమితి ఆరోపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచీ కౌంటర్ ఎటాక్ నడుస్తోంది.

Political Floods In Andhra Pradesh Telangana

Political Floods In Andhra Pradesh, Telangana

తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత అవసరం. చిన్న చిన్న విషయాలకు పంచాయితీ పెట్టుకుంటే ఎలా.? ఏ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ముంపు రగడను ఇరు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు తెరపైకి తెస్తున్నారన్నదే ఇక్కడ కీలకం. ఈ పంచాయితీ ఎవరికీ మంచిది కాదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో విభజన, సమైక్య ఉద్యమాలతో మాటల తూటాలు పేలాయి. చిన్నా చితకా దాడులూ జరిగాయి.
అంతా ప్రశాంతంగా వున్న ప్రస్తుత పరిస్థితుల్లో నాయకులు సంయమనం పాటించాలి. అంతే తప్ప, ఆవేశకావేశాలకు ఎవరూ లోనుకాకూడదు.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది