Gorantla Madhav : నాలుగు గోడల మధ్య జరిగింది.. గోరంట్ల మాధవ్ బూతు వీడియోపై సజ్జల కామెంట్స్..
Gorantla Madhav : హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ లీక్ కావడంతో ఆ వ్యవహారం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అగ్గి రాజేసింది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మహిళలతో అసభ్యంగా న్యూడ్ కాల్స్ చేసి వేధిస్తారా అంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎంపీ బాధ్యత మరిచి చేసిన పనికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. మహిళా సంఘాలు, మీడియా, ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వాన్ని కార్నర్ చేయడంతో ఈ వ్యవహారంపై సీఎం జగన్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది.
Gorantla Madhav : మార్ఫింగ్ కాదని తెలిస్తే చర్యలు తప్పవు
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణను తాడేపల్లిలోని తన కార్యాలయానికి పిలిపించుకుని సీఎం జగన్ మాట్లాడినట్టు సమాచారం. ఇందులో నిజనిజాలు తేల్చాలని ఆయనకు సూచించినట్టు తెలుస్తోంది. జగన్‌తో సమావేశం అనంతరం సజ్జల సీఎం ఆఫీస్ బయట మీడియాతో మాట్లాడారు. హిందూపురం ఎంపీ వీడియో ఘటనపై సీఎం స్పందించిన తీరును వివరించారు. ఇదే విషయంపై ఎంపీతో మాట్లాడగా అది వాస్తవం కాదని, వీడియో మార్ఫింగ్ జరిగిందని చెప్పారన్నారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారని చెప్పారని వివరించారు. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని, వీడియో మార్ఫింగ్ కాదని తేలితే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జల వెల్లడించారు. అంతేకాకుండా ఈ వ్యవహారం నాలుగు గోడల మధ్య జరిగిందని, అది చూసేందుకు అసభ్యంగా ఉన్నా అవతల వ్యక్తి ఎవరో ఇంతవరకు తెలియలేదని..
వారి నుంచి కనీసం ఫిర్యాదు కూడా అందలేదని చెప్పారు. ఇక గోరంట్ల మాధవ్ వీడియోపై ప్రతిపక్షం అనవసరంగా రాద్దాంతం చేస్తుందని మండిపడ్డారు.చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసి ఏదో ఊహించుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ ఒక మునిగిపోయిన పడవ అని.. ఒక్క రోజులో అధికారంలోకి రావడానికి చంద్రబాబు షార్ట్ కర్ట్స్ వెతుకుతున్నారని అది సాధ్యం కాదన్నారు.వచ్చే ఎన్నికల్లోనూ తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని సజ్జల తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.