Sudigali Sudheer : ఎక్స్ ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ మ్యాజిక్ షో.. నోరెళ్లబెట్టిన జడ్జి రోజా, రష్మీ, వర్ష?
Sudigali Sudheer : ఎక్స్ ట్రా జబర్దస్త్.. ఖతర్నాక్ కామెడీ షో గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎక్స్ ట్రా జబర్దస్త్ తెలుగు బుల్లితెర మీదనే టాప్ కామెడీ షో. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ రెండూ ఒకే ప్లాట్ ఫాం నుంచి వచ్చినవే. రెండు షోలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇప్పటి వరకు ఈ షోను బీట్ చేసే షో రాలేదు అంటే.. జబర్దస్త్ కు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

sudigali sudheer magic in extra jabardasth latest promo
ఎక్స్ ట్రా జబర్దస్త్ అనే పేరు వినగానే మనకు టక్కున గుర్తొచ్చే పేర్లు సుడిగాలి సుధీర్, రష్మీ. అవును.. ఈ జంటకు ఆన్ స్క్రీన్ మీద బాగానే క్రేజ్ ఉంది. వీళ్ల మధ్య ఏదో ఉందని.. చాలా రోజుల నుంచి టాక్ నడుస్తున్నా.. వీళ్లు మాత్రం తమ మధ్య ఏం లేదంటూ చేతులు దులిపేసుకుంటున్నారు.

sudigali sudheer magic in extra jabardasth latest promo
సరే.. అదంతా కాసేపు పక్కన పెడితే.. సుడిగాలి సుధీర్.. ఎక్స్ ట్రా జబర్దస్త్ కు ఒక ఐకాన్. ఆయన లేని ఎక్స్ ట్రా జబర్దస్త్ ను ఊహించలేం. తెలుగు బుల్లితెర మీదనే టాప్ మోస్ట్ కమెడియన్ ఎవరు అని అడిగితే.. టక్కున సుధీర్ పేరే చెబుతారు. అది ఆయనకు ఉన్న క్రేజ్.

sudigali sudheer magic in extra jabardasth latest promo
Sudigali Sudheer : మ్యాజిక్ షోతో రచ్చ రచ్చ చేసిన సుడిగాలి సుధీర్
అయితే.. సుడిగాలి సుధీర్ కామెడీ చేస్తే సూపర్ గా ఉంటుంది. ఆయన చేసే కామెడీ కోసమే చాలామంది ఎక్స్ ట్రా జబర్దస్త్ ను చూస్తుంటారు. అయితే.. తాజాగా సుడిగాలి సుధీర్.. ఎక్స్ ట్రా జబర్దస్త్ లో మ్యాజిక్ షో చేశాడు. అది ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్. నిజానికి.. సుడిగాలి సుధీర్.. జబర్దస్త్ కు రాకముందు.. మ్యాజిక్ షోలు చేసేవాడు. ఆ అనుభవంతో.. జడ్జి రోజా రిక్వెస్ట్ చేయడంతో.. ఎక్స్ ట్రా జబర్దస్త్ స్టేజ్ మీద మ్యాజిక్ షో చేశాడు. మనోడి షోను చూసి స్టేజ్ మీద ఉన్నవాళ్లు అందరూ నోరెళ్లబెట్టారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా చూసేయండి.

ఇది కూడా చదవండి ==> అయిపాయె.. యాంకర్ ప్రదీప్ కు ఐలవ్యూ చెప్పేసిన శ్రీముఖి? షాక్ లో అభిమానులు..!
ఇది కూడా చదవండి ==> రాజమౌళిపై రామ్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు..!
ఇది కూడా చదవండి ==> రాజమౌళి – మహేష్ కాంబో.. పొరపాటున పాయింట్ లీక్ చేసిన విజయేంద్ర ప్రసాద్
ఇది కూడా చదవండి ==> వైవాహిక జీవితంపై నెటిజన్ ప్రశ్న.. షాకింగ్ రిప్లయి ఇచ్చిన నిహారిక..?