Corona Second Wave : ఈ లక్షణాలు కూడా ఉంటే కరోనా వచ్చినట్టే? రుచి, వాసన కోల్పోవడంతో పాటు ఇవి కూడా?
Corona Second Wave : కరోనా సెకండ్ వేవ్.. ప్రస్తుతం ఇదే ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది. గత సంవత్సరం కరోనా వైరస్ తో బాధపడ్డాం. ఇప్పుడు అదే వైరస్ మ్యుటేషన్ చెంది కరోనా సెకండ్ వేవ్ గా రూపాంతరం చెందింది. ఇది గత సంవత్సరం ప్రబలిన కరోనా వైరస్ కన్నా చాలా డేంజర్. ఈ వైరస్ ఎక్కువగా యూత్ కే వ్యాప్తిస్తోంది. అందులోనూ దీని లక్షణాలు కూడా చాలా డిఫరెట్ గా ఉన్నాయి. మనిషి మనిషిలోనూ లక్షణాలు మారుతున్నాయి. కరోనా వైరస్ కన్నా.. కరోనా సెకండ్ వేవే చాలా డేంజర్ అని డాక్టర్లు చెబుతున్నప్పటికీ… కరోనా సెకండ్ వేవ్ వల్ల మరణాల రేటు మాత్రం చాలా తగ్గింది. అయితే… ఈ వైరస్ ముఖ్యంగా శరీరంలోకి ప్రవేశించాక… ఏదైనా వీక్ గా ఉన్న అవయవం మీద మాత్రం తన ప్రభావాన్ని చూపుతోంది.
కరోనా వచ్చింది అని తెలియాలంటే… వైరస్ శరీరంలోకి ప్రవేశించిన వారం తర్వాతే అసలు లక్షణాలు బయటపడతాయి. రుచి, వాసనను కోల్పోవడం అందరికీ ఉండే లక్షణమే. పొడి పొడి దగ్గు రావడం, కొద్దిగా జ్వరం రావడం, తలనొప్పి… ఇవి కూడా కామనే. కానీ… కరోనా సెకండ్ వేవ్ వైరస్ సోకితే ఇంకా వేరే లక్షణాలు బయటపడతాయట. ఆ లక్షణాలు ఉంటే కరోనా సెకండ్ వేవ్ సోకినట్టే అని ఫిక్స్ అయిపోవాలి.
Corona Second Wave : నోటిలో వచ్చే మార్పులు
కరోనా వస్తే పైన చెప్పుకున్న లక్షణాలతో పాటు నోరు పొడిబారిపోవడం, నోరు ఎండిపోవడం జరుగుతుంది. అలాగే నోటిలో పొక్కులు ఏర్పడటం కూడా జరుగుతుంది. నాలుక మండినట్టు అనిపించడం, దురదలా అనిపించడం, నాలుక మీద చిన్న చిన్న దద్దుర్లు రావడం జరుగుతాయి. అలాగే కరోనా వల్ల నాలుక రంగు కూడా మారుతుందట. పెదాలు కూడా వాచినట్టు ఉబ్బుతాయి. మామూలుగా ఉన్నప్పుడు ఎలా తినేవారో.. కరోనా వచ్చినప్పుడు అలా తినలేరు. నోరు ఆహారాన్ని స్వీకరించలేదు. గొంతు నొప్పి వల్ల అన్నం తినడం కూడా కష్టంగా మారుతుంది. అందుకే… ఇటువంటి లక్షణాలు ఉంటే వెంటనే కరోనా టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం.