fingers sound : చేతి వేళ్లను విరిచినప్పుడు టప్పున శబ్దం వస్తుంది ఎందుకో మీకు తెలుసా…?
fingers sound : చేతి వేళ్లను ఒకదాని తర్వాత ఒకటి గుంజటం, వెనక్కి, పక్కకి వంచటం మనందరం ఎప్పుడో ఒకసారి చేస్తూనే ఉంటాం. ఎక్సర్ సైజ్ లో భాగంగా గానీ టైం పాస్ కి గానీ ఫిజికల్ రిలీఫ్ కోసం గానీ అలా చేస్తుంటాం. అలా చేసినప్పుడు మొదటిసారి టపటపా శబ్ధం రావటాన్నీ గమనించే ఉంటాం. రెండోసారి ఎలాంటి సౌండూ రాదు. అయితే తొలిసారి ఆ శబ్ధం ఎందుకు వస్తుందో ఎవరికీ పెద్దగా తెలియదు. ఎముకలు కదలటం వల్ల సౌండ్ వస్తుందేమో అనుకుంటాం. కానీ కాదు. దీని వెనక ఆసక్తికరమైన ఒక అంశం ఉంది. అది ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సింది.
ఏంటది?..
మన శరీరంలోని ప్రతి రెండు ఎముకల మధ్యా సినోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఈ ద్రవ పదార్థం కందెన లాగా (లూబ్రికెంట్ మాదిరిగా) పనిచేస్తుంది. చేతులను, వేళ్లను ముడిచినప్పుడు, తెరిచినప్పుడు ఈ ఫ్లూయిడ్ నుంచి నైట్రోజన్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఈ నత్రజని వాయువు బుడగలను వెలువరిస్తుంది. వేళ్లను ముడిచినప్పుడు ఒత్తిడికి ఆ బబుల్స్ పగలటం వల్లే టపటపమని సౌండ్ వస్తుంది. ఈ బుడగలు మళ్లీ ఏర్పడాలంటే కనీసం ఇరవై నిమిషాల సమయం పడుతుంది. ఈ సౌండ్ కోసం చాలా మంది తరచూ సరదాగా చేతులను, వేళ్లను విరుస్తుంటారు. అలా చేస్తే ఎముకలు విరిగిపోతాయని, వ్యాధి బారిన పడతారని అంటుంటారు. గట్టిగా వంచినప్పుడు ఎముకలు విరుగుతాయి గానీ ప్రత్యేకంగా ఒక రోగం రావటం అనేది మాత్రం అబద్ధమని డాక్టర్లు చెబుతున్నారు.
కూల్ డ్రింక్.. కోడి గుడ్డు..: fingers sound
మన శరీరంలోని ఎముకల మధ్య ఉండే ఈ సినోవియల్ ఫ్లూయిడ్ ని కోడి గుడ్డులోని పసుపు పచ్చని సొనతో పోల్చవచ్చు. మనం కదిలిన ప్రతిసారీ ఎముకలు కదులుతుంటాయి. ఆ ఎముకలకు నొప్పి పుట్టకుండా, అవి అరిగిపోకుండా స్మూత్ గా కదిలేలా ఈ లూబ్రికెంట్ ఉపయోగపడుతుంది. వయసు మీద పడ్డవాళ్లలో ఈ ఫ్లూయిడ్ అయిపోవటం వల్ల మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వస్తుంటాయి. సినోవియల్ ఫ్లూయిడ్ ఉత్పత్తి చేసే బుడగలను కూల్ డ్రింక్ బాటిల్ సౌండ్ తో పోల్చవచ్చు.
ఏదైనా కూల్ డ్రింక్ సీసా మూతను తెరిచినప్పుడు అందులోని గ్యాస్ ఒక్కసారిగా పైకి తన్నుకొస్తుంది. అప్పుడు బుస్ మని శబ్ధం వస్తుంది. ఆ సౌండ్ తోపాటే గ్యాస్ బుడగలు కూడా వస్తాయి. ఏదేమైనప్పటికీ చేతి వేళ్లను వంచినప్పుడు, లాగినప్పుడు శబ్ధం రావటం వెనక ఇంత సైంటిఫిక్ రీజన్ ఉండటం చెప్పుకోదగ్గ విషయమే.
ఇది కూడా చదవండి ==> అందరం చూసిన మొక్కే.. దీనివల్ల ఎన్ని లాభాలో మనకు ఇప్పటిదాకా తెలియదు..?
ఇది కూడా చదవండి ==> ఉలవచారు ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు అస్సలు వదలరు…!
ఇది కూడా చదవండి ==> షుగర్ ఎందుకు వస్తుందో తెలుసా? అసలు కారణం తెలిస్తే బిత్తరపోతారు..!
ఇది కూడా చదవండి ==> రాత్రి పూట దిండు కింద వెల్లుల్లి పెట్టుకొని నిద్రపోతే బాడీ లోపల ఏం జరుగుతుందో తెలిస్తే నోరెళ్లబెడతారు?