నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 20 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ.. వివరాలు ఇవే..!
Telangana : తెలంగాణ నిరుద్యోగుకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వాళ్లకు మంచి శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. త్వరలోనే భారీ స్థాయిలో పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయబోతుంది ప్రభుత్వం. పోలీస్ ఉద్యోగాల కోసం చాలా రోజుల నుంచి తెలంగాణ నిరుద్యోగ యువత ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో వాళ్లకు ప్రభుత్వం తీపి కబురు చెప్పేసరికి.. నిరుద్యోగుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది.
పోలీసు శాఖలో వివిధ భాగాల్లో ఖాళీగా ఉన్న సుమారు 20 వేల పోలీసు జాబ్స్ ను త్వరలోనే భర్తీ చేయనున్నట్టు హోంమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ వచ్చాక.. సుమారు 80 వేల వరకు పోలీసు నియామకాలను చేపట్టామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మరో 20 వేల పోలీసు ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తున్నామని.. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత అందిపుచ్చుకోవాలని ఆయన తెలిపారు.

telangana police jobs 2021 telangana govt
Telangana : మహిళలకు నియామకాల్లో 33 శాతం రిజర్వేషన్లు
పోలీస్ శాఖను పటిష్ఠం చేసేందుకు.. పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసి.. పోలీస్ శాఖకు తగినన్ని నిధులు కేటాయించి.. పోలీస్ శాఖను దేశంలోనే అత్యున్నతమైన శాఖగా తీర్చిదిద్దడమే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యమన్నారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించడంతో పాటు.. పోలీస్ సిబ్బందికి తగినన్ని కొత్త వాహనాలను కూడా అందిస్తున్నామని ఆయన అన్నారు. మొదటి సారి.. తెలంగాణలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం.. పోలీసు నియామకాల్లో వాళ్లకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించినట్టు మంత్రి స్పష్టం చేశారు.