Tpcc Chief : టీపీసీసీ చీఫ్ పోస్ట్ కోసం.. ఢిల్లీలో ఆ ఇద్దరి మకాం.. రిజల్ట్ రేపే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tpcc Chief : టీపీసీసీ చీఫ్ పోస్ట్ కోసం.. ఢిల్లీలో ఆ ఇద్దరి మకాం.. రిజల్ట్ రేపే..!

 Authored By kondalrao | The Telugu News | Updated on :13 June 2021,4:59 pm

Tpcc Chief : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్ష పదవికి అభ్యర్థిని ఎంపిక చేసే ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఈ ఇద్దరు ఆశావహుల్లో ఎవరిని ఆ పోస్టు వరిస్తుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితోపాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా గత రెండు రోజులుగా హస్తినలో మకాం వేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ సైతం నిన్న శనివారం తమిళనాడు నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. మాణిక్కం ఠాగూర్.. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, భట్టిలతో చివరి దశ చర్చలు జరిపి హైకమాండ్ కి ఫైనల్ రిపోర్ట్ ఇవ్వనున్నారరు. దాని ఆధారంగా పార్టీ అధిష్టానం టీపీసీసీ చీఫ్ ని సెలెక్ట్ చేసి రేపు సోమవారం ప్రకటిస్తుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

యువనేతకు పదోన్నతి..

ఇదిలాఉండగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి ఆల్రెడీ టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో హస్తం పార్టీ ఎలాంటి ఫలితాలను సాధించింది అనే అంశాన్ని పక్కన పెడితే రేవంత్ రెడ్డి తన పదవికి న్యాయం చేస్తున్నారనే చెప్పాలి. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఒంటి కాలి మీద లేస్తున్నారు. పదునైన విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కోమటిరెడ్డితో పోల్చితే రేవంత్ రెడ్డి యువకుడు. మాటకారి కూడా. రాష్ట్ర వ్యాప్తంగా యూత్ లో ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి.

Tpcc Chief Post for Revath reddy and komatireddy venkat reddy

Tpcc Chief Post for Revath reddy and komatireddy venkat reddy

జిల్లాకే పరిమితం : Tpcc Chief

కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రభావం నల్గొండ జిల్లా వరకే పరిమితం. పైగా వెంకట్ రెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి రేపో మాపో బీజేపీలోకి వెళ్లే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెంకట్ రెడ్డికి టీపీసీసీ పదవి ఇస్తే తమ్ముణ్నే పార్టీలో ఉంచలేనోడు రాష్ట్రంలో కాంగ్రెస్ ని ఏం ఉద్ధరిస్తాడు అనే విమర్శలు స్వపక్షం నుంచే రావొచ్చని అంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పై ఒక రిమార్క్ కూడా ఎప్పటి నుంచో ఉంది. అదేంటంటే.. ప్రజల్లో ఆదరణ కలిగిన వ్యక్తికి పదవులు ఇవ్వరు. దీనికి చక్కని ఉదాహరణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఎంత మంది కోరినా సోనియా గాంధీ పట్టించుకోలేదు. ఇప్పుడూ ఇదే మాదిరిగా వ్యవహరిస్తే రేవంత్ రెడ్డికి మొండి చేయి ఖాయం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావటం తథ్యం.

ఇది కూడా చ‌ద‌వండి ==> Ration Card : రేషన్ కార్డు ఉందా? మీకు బ్యాడ్ న్యూస్? వెంటనే ఇది చదవండి?

ఇది కూడా చ‌ద‌వండి ==> Eatala : సరికొత్త చరిత్ర నెలకొల్పిన ఈటల రాజేందర్

ఇది కూడా చ‌ద‌వండి ==> Viral Video : స్టేజ్ మీదనే.. పెళ్లి కొడుకును చూసి లిప్ కిస్ ల‌తో రెచ్చిపోయిన పెళ్లి కూతురు చెల్లెలు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> vivek : గడ్డం వివేక్ పరిస్థితి.. అడ్డం తిరిగిందా..?

kondalrao

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది