Police Jobs : సబ్ ఇన్ స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల… అర్హత ఏంటంటే…
Police Jobs : సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ భారీగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు వివిధ భాగాల్లో 122 పోస్టులు కేటాయించారు. అందులో అన్ రిజర్వుడ్-57, SC-16, ST-8, OBC-31, EWS-10 పోస్టులు కేటాయించారు. అలాగే హెడ్ కానిస్టేబుల్ విభాగంలో 418 పోస్టులు ఉన్నాయి. అందులో అన్ రిజర్వుడ్-182, SC-61, ST-29, OBC-122, EWS-34 పోస్టులను కేటాయించారు. అయితే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 12వ తరగతి పాస్ అయి ఉండాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులు వయస్సు అక్టోబర్ 25 నాటికి 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియకు సంబంధించిన మరింత సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ ను చెక్ చేసుకోవాలి. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్- 5 ద్వారా రూ.29,200-92,300 చెల్లిస్తారు. హెడ్ కానిస్టేబుల్ పే స్థాయి – 4 కింద రూ.25,508-81,100 చెల్లిస్తారు. వీటిని దరఖాస్తు చేసుకోవడానికి 100 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ మహిళలకు మరియు దివ్యాంగులకు ఫీజు లేదు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఈ క్రింది ప్రక్రియను తెలుసుకోండి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ www.cisfrectt.in కు వెళ్లాలి. అక్కడ కెరీర్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. దీనిలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ కనిపిస్తాయి. నోటిఫికేషను డౌన్లోడ్ చేసుకొని పోస్టుల వివరాలను పూర్తిగా తెలుసుకోవాలి. తర్వాత వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి యూజర్ ఐడి పాస్ వర్డ్ క్రియేట్ చేయాలి. లాగిన్ ఆప్షన్ ఎంచుకొని దరఖాస్తులను నమోదు చేసుకోవాలి. అయితే ఈ లింక్ సెప్టెంబర్ 26 నుంచి ఓపెన్ అవుతుంది. ఫిజికల్ అఫీషియెన్సీ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత పరీక్ష స్కిల్ టెస్ట్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక ఉంటుంది.