Revanth Reddy: తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం.. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఆ నేతలు
Revanth Reddy : ఎట్టేకేలకు ఉత్కంఠ వీడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీపీసీసీ చీఫ్ పదవిని ఏఐసీసీ భర్తీ చేసింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డిని నియమిస్తున్నట్టు ఏఐసీసీ ప్రకటించింది. నిజానికి.. ఈ పదవిని ఎప్పుడో భర్తీ చేయాల్సి ఉన్నా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. చివరకు.. తాజాగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ… తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమిస్తూ ప్రకటన జారీ చేసింది.
Revanth Reddy : టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు వీళ్లే
టీపీసీసీ చీఫ్ పదవితో పాటు.. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులను కూడా ఏఐసీసీ నియమించింది. అయితే.. తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. ఆయన్ను టీపీసీసీ చీఫ్ గా నియమించడంతో.. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా.. మహమ్మద్ అజారుద్దీన్, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్ లను ఏఐసీసీ నియమించింది.
టీపీసీసీ ఉపాధ్యక్షులుగా.. చంద్రశేఖర్ సంబని, దామోదర్ రెడ్డి, మల్లు రవి, పొడెం వీరయ్య, జావేద్ ఆమీర్, వేం నరేందర్ రెడ్డి, గోపిశెట్టి నిరంజన్, సురేశ్, కుమార్ రావులను నియమిస్తున్నట్టు ఏఐసీసీ ప్రకటించింది. అలాగే.. ప్రచార కమిటీకి చైర్మన్ గా మధు యాష్కీ గౌడ్ ను నియమించింది. ప్రచార కమిటీ కన్వినర్ గా సయ్యద్ హుస్సేనిని నియమించింది.
ఇక.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా సీనియర్ నేత దామోదర రాజనర్సింహను నియమించింది. ఏఐసీసీ అమలు కమిటీ చైర్మన్ గా ఆలేటీ మహేశ్వర్ రెడ్డిని ఏఐసీసీ నియమించింది.