Viral News : చర్మం ఒలిచి తల్లికి చెప్పులు కుట్టించిన కొడుకు.. ఉప్పొంగిన మాతృ ప్రేమ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral News : చర్మం ఒలిచి తల్లికి చెప్పులు కుట్టించిన కొడుకు.. ఉప్పొంగిన మాతృ ప్రేమ..!

 Authored By ramu | The Telugu News | Updated on :23 March 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Viral News : చర్మం ఒలిచి తల్లికి చెప్పులు కుట్టించిన కొడుకు.. ఉప్పొంగిన మాతృ ప్రేమ..!

Viral News : అమ్మ అనే పదంలోనే కమ్మదనం ఉంటుంది. ఈ సృష్టిలో తల్లి కంటే గొప్పగా ప్రేమించే వారు ఇంకెవరూ ఉండరు. తాను కొవ్వత్తిలా కరుగుతూ తన పిల్లలకు వెలుగునిచ్చేదే తల్లి ప్రేమ. కొడుకులు, కూతర్లు తల్లిని అసహ్యించుకున్నా సరే.. తల్లి మాత్రం ఏనాడూ తన పిల్లలను దూరం చేసుకోదు. ఈ రోజుల్లో కొందరు మూర్ఖులు తల్లిదండ్రులను అనాథాశ్రమంలో వదిలేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకొందరు తల్లిదండ్రులను ఆస్తుల కోసం చంపేస్తున్న దారుణమైన ఘటనలు కూడా చూస్తున్నాం. ఇలాంటి రోజుల్లో ఓ కొడుకు చేసిన పని అందరితో కన్నీళ్లు పెట్టిస్తోంది.

సాధారణంగా చర్మం ఒలిచి తల్లికి చెప్పులు కుట్టించినా రుణం తీరదని అంటుంటారు. అలాంటి సామెతను నిజం చేసి చూపించాడు ఓ కొడుకు. మధ్య ప్రదేశ్ ఉజ్జయినికి చెందిన రౌనక్ గుర్జార్ ఒకప్పుడు రౌడీ షీటర్ గా ఉండేవాడు. కొడుకు జీవితాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో అతని తల్లి రామాయణం బోధనలు చేసింది. దాంతో రౌనక్ పూర్తిగా మారిపోయాడు. రామయణం గురించి విని రౌడీయిజాన్ని వదిలేశాడు. అంతే కాకుండా రామాయణంలో రాముడు తన తల్లి పట్ల చూపించిన ప్రేమకు ముగ్దుడయ్యాడు. తాను కూడా తన తల్లికి రుణపడి ఉన్నానని.. దాన్ని ఎలాగైనా తీర్చుకోవాలని భావించాడు.

ఎవరూ ఊహించని విధంగా తన తల్లికి బహుమతి ఇవ్వాలనుకున్నాడు. అనుకున్నడే తడవు.. తన చర్మాన్ని ఒలిచి తల్లికి చెప్పులు కుట్టించాలని భావించాడు. ఓ హాస్పిటల్ కు వెళ్లి చెప్పాడు. ముందు డాక్టర్లు షాక్ అయ్యాడు. కానీ అతనికి తల్లి మీదున్న ప్రేమతో వారు అతని శరీరం నుంచి కొంత చర్మాన్ని తొలగించారు. ఆ చర్మంతో తన తల్లికి చెప్పులు తయారు చేయించాడు రౌనక్. మార్చి 14 నుంచి 21 వ తేదీ వరకు తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన భగవత్ కథలో రౌనక్ తన తల్లికి ఆ చెప్పులు సమర్పించి కృతజ్ఞతలు చాటుకున్నాడు. తన కొడుకు చేసిన పనికి ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. తన కొడుకును చూసి గర్విస్తున్నట్టు తెలిపింది. తన కొడుకుకు ఎలాంటి కష్టం రాకుండా చూడాలని ఆ దేవుడిని కోరుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది