Viral News : వర్షాల కోసం వింత ఆచారం.. రాఘవపూర్ గ్రామంలో అరుదైన పూజా సంప్రదాయం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral News : వర్షాల కోసం వింత ఆచారం.. రాఘవపూర్ గ్రామంలో అరుదైన పూజా సంప్రదాయం..!

 Authored By ramu | The Telugu News | Updated on :21 July 2025,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Viral News : వర్షాల కోసం వింత ఆచారం.. రాఘవపూర్ గ్రామంలో అరుదైన పూజా సంప్రదాయం..!

Viral News : జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలోని రాఘవపూర్ గ్రామం వర్షాలు కురవాలని నిర్వహించే ఓ ప్రత్యేక ఆచారం కోసం తాజాగా వార్తల్లోకి వచ్చింది. గ్రామస్థులు పోతరాజు గండి వద్ద నిర్వహించే ఈ ప్రత్యేక పూజలు స్థానికుల నమ్మకానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. వర్షాభావం నేపథ్యంలో, గ్రామ యువకులు పోతరాజు గండి వద్ద ఉన్న రాతిబండపై చెయ్యి పెట్టి “వరద పాశం” నాకుతూ మొక్కులు చెల్లించడం ఈ సంప్రదాయం ప్రత్యేకత.

Viral Video వర్షాల కోసం వింత ఆచారం రాఘవపూర్ గ్రామంలో అరుదైన పూజా సంప్రదాయం

Viral Video : వర్షాల కోసం వింత ఆచారం.. రాఘవపూర్ గ్రామంలో అరుదైన పూజా సంప్రదాయం..!

Viral News : కొత్త సంప్ర‌దాయం..

పెళ్లి కాని యువకులే ఈ పూజలో పాల్గొనడం ఆచారంలో భాగం. ఇది తమ గ్రామంలో దశాబ్దాల నాటి సంప్రదాయమని, పెద్దల నుంచి తాము దీన్ని కొనసాగిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. ఈ పూజ అనంతరం రెండు రోజుల్లోగా వర్షాలు కురుస్తాయని గ్రామస్థులు గట్టిగా నమ్ముతుంటారు. మొక్కులు చెల్లించిన తర్వాత అక్కడి ఆకాశం మేఘావృతమై వర్షం కురిసిన సందర్భాలు చాలానే ఉన్నాయంటూ గత అనుభవాలను గుర్తుచేస్తున్నారు.

ఈ పూజకు పెద్దఎత్తున గ్రామస్తులు తరలివచ్చి పాల్గొంటారు. వాతావరణ మార్పులు, వ్యవసాయ అవసరాల నేపథ్యంలో ఇప్పటికీ ఇలా వర్షానికి యాచించే సంప్రదాయాలు కొన్ని గ్రామాల్లో ప్రాచుర్యం పొందుతూనే ఉన్నాయి. రాఘవపూర్ గ్రామపు ఈ వింత పూజా విధానం అదే ప్రత్యేకతను చాటుతోంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది