Virat Kohli : బస్సులో అనుష్కతో కోహ్లీ వీడియో కాల్.. ఫ్యాన్స్‌కు చూపించి నవ్వులే నవ్వులు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Virat Kohli : బస్సులో అనుష్కతో కోహ్లీ వీడియో కాల్.. ఫ్యాన్స్‌కు చూపించి నవ్వులే నవ్వులు

 Authored By mallesh | The Telugu News | Updated on :30 September 2022,11:00 am

Virat Kohli : విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మను బాగా మిస్ అవుతున్నట్టు తెలుస్తోంది. వరుసగా సిరీస్‌లు ఆడుతుండటంతో తన భార్య పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాడని ఈ సీన్ చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది. ప్రస్తుతం టీమిండియా రాబోయే టీ20 ప్రపంచకప్ కోసం వరసగా మ్యాచులు ఆడుతోంది. వీటిని వరల్డ్ కప్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌గా బీసీసీఐ భావిస్తోంది.ఈ క్రమంలోనే సౌతాఫ్రికాతో మ్యాచ్ అనంతరం బస్సులో వెళ్తున్న కోహ్లీ అనుష్కతో వీడియో కాల్ మాట్లాడాడు.

Virat Kohli : ఫ్యాన్స్‌ను చూపిస్తూ కోహ్లీ నవ్వులు

కేరళలోని త్రివేండ్రంలో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు సౌతాఫ్రికాను చిత్తు చేసింది.దీంతో అభిమానులు క్రికెటర్స్ వెళ్లే దారిలో సందడి చేశారు. రోడ్డుకు ఇరువైపులా నిలబడి తమ అభిమాన క్రికెటర్లుకు చేతులు ఊపుతూ గ్రాండ్‌గా సాగనంపారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ తన భార్య అనుష్కతో వీడియో కాల్ మాట్లాడుతున్నారు. ఫ్యాన్స్ చేతులు ఊపుతూ గోల చేస్తున్న టైంలో ఒక్కసారిగా అనుష్కకు అభిమానుల హర్షాతిరేకాలను చూపించారు. అనుష్కను చూసిన ఫ్యాన్స్ మరింతగా కేకలు వేస్తూ సందడి చేశారు. దీంతో అనుష్క, కోహ్లీ కూడా కాసేపు నవ్వుకున్నారు.

Virat Kohli Video Call With Anushka Sharma In Bus

Virat Kohli Video Call With Anushka Sharma In Bus

ఇంతలో క్రికెటర్ల ఉండే బస్సు అక్కడి నుంచి వెళ్లిపోయింది. వరుసగా మ్యాచులు ఆడుతున్న క్రమంలో క్రికెటర్లు తమ కుటుంబాలను మిస్ అవుతున్నారని ఈ వీడియో చూసిన పలువురు కామెంట్స్ చేస్తున్నారు. దేశం కోసం కుటుంబానికి దూరంగా ఉండటం, అటు జవాన్లకు .. ఇటు క్రికెటర్లకు మాత్రమే సాధ్యం అవుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరు ఈసారి ఎలాగైనా టీ20 వరల్డ్ కప్ ఇండియా కొట్టాలని రోహిత్ సేనకు విషెష్ చెబుతున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది