Bath Water : స్నానానికి ఏ నీళ్లు వాడాలి? వేడి నీళ్లా? చన్నీళ్లా? అందరూ చేసే తప్పు ఇదే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bath Water : స్నానానికి ఏ నీళ్లు వాడాలి? వేడి నీళ్లా? చన్నీళ్లా? అందరూ చేసే తప్పు ఇదే?

 Authored By jagadesh | The Telugu News | Updated on :5 April 2021,8:05 pm

Bath Water : స్నానం అనేది ప్రతి మనిషికి ప్రతి రోజు చేయాల్సిన ఒక పని. ఒక్కరోజు స్నానం చేయకున్నా ఒళ్లంతా చెమట వాసన వస్తుంది. ఎండాకాలం అయితే కొందరు రోజుకు రెండు సార్లు స్నానం చేస్తుంటారు. కష్టపడి పనిచేసే వాళ్లు, ఆఫీసులకు వెళ్లే వాళ్లు కూడా రోజూ ఉదయం, రాత్రి రెండు సార్లు స్నానం చేస్తారు. అసలు మనిషి స్నానం ఎందుకు చేయాలి? అంటే మన ఒంట్లో ఉన్న వ్యర్థాలను చర్మం ద్వారా మన శరీరం బయటికి పంపిస్తుంది. ఆ వ్యర్థాల ద్వారా వచ్చే చెడు వాసనను పోగొట్టుకోవడం కోసమే రోజుకు కనీసం ఒక్కసారైనా స్నానం చేయాలని పెద్దలు చెబుతుంటారు.

అయితే.. వెనకటికి అందరూ పొద్దున లేవగానే కాలకృత్యాలు తీర్చుకొని చన్నీళ్లలో స్నానం చేసేవాళ్లు. స్నానం చేసిన తర్వాతనే ఏ పని అయినా. ఆ కాలంలో పెద్దలు ఒక పద్ధతి ప్రకారం నడుచుకునేవాళ్లు. కానీ.. ఇప్పుడు మాత్రం అంతా మారిపోయింది. ఈ జనరేషన్ చేసే పనులే వేరు. టెక్నాలజీ వచ్చింది కదా. అందుకే.. పెద్దల మాటలను పెడచెవిన పెట్టడమే నేటి జనరేషన్ కు తెలిసింది.

నేటి తరుణంలో ఏ ఇంట్లో చూసినా గీజర్లు, హీటర్లు. గీజర్ లేని ఇల్లు లేదు. స్నానం చేయాలంటే గీజర్ ఆన్ చేయడం… నచ్చినన్ని వేడి నీళ్లతో స్నానం చేయడం. కానీ… వేడి నీళ్లతో స్నానం చేస్తే మంచిదా? లేక చన్నీళ్లతో చేయాలా? అనే విషయం చాలామందికి తెలియదు. కానీ… చన్నీళ్లతో స్నానం చేయడమే ఆరోగ్యానికి మంచిది అని చెబుతున్నారు నిపుణులు.

which water is good for health for bathing

which water is good for health for bathing

Bath Water : ఉదయం వేడినీళ్లతో స్నానం చేయడం చాలా డేంజర్ అట

చాలామంది ఆఫీసులకు, ఇతర పనులకు వెళ్లే వాళ్లు ఉదయమే స్నానాలు చేస్తుంటారు. వాళ్లు ఎక్కువగా వేడి నీళ్లతోనే స్నానం చేస్తుంటారు. కానీ.. ఉదయం పూట వేడినీళ్లతో స్నానం చేయడం అంత మంచిది కాదంటున్నారు డాక్టర్లు. నిజానికి వేడి వేడి నీళ్లతో స్నానం చేస్తే హాయిగా ఉంటుంది కానీ… దాని వల్ల శరీరం బద్ధకంగా మారుతుందట. బాడీ మొత్తం రిలాక్స్ అవ్వడం వల్ల.. నిద్ర రావడం, మత్తు మత్తుగా అనిపించడం జరుగుతుందట.. దాని వల్ల ఆ రోజు మొత్తం చేయబోయే పనుల మీద ఎఫెక్ట్ పడుతుందంటున్నారు.

ఉదయం పూట వేడి నీళ్లకు బదులు చన్నీళ్లతో స్నానం చేస్తే… శరీరం యాక్టివ్ అవుతుందట. దాని వల్ల ఆ రోజంతా మనసు ప్రశాంతంగా, ఉత్తేజితంగా ఉండటంతో చేయాల్సిన పనులన్నీ స్పీడ్ గా చేసే అవకాశం ఉంటుందట. చన్నీళ్లతో క్రమం తప్పకుండా స్నానం చేస్తే ముఖం అందంగా తయారవుతుందట. ముఖం మీద ఉన్న మొటిమలు, కురుపులు పోతాయట. ముఖం మీద చాలామందికి చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడుతుంటాయి. అవి కూడా చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల పోతాయట.

అయితే… చన్నీళ్లతో అందరూ స్నానం చేయడం కూడా కరెక్ట్ కాదట. అంటే.. కొందరికి మైగ్రేన్ వంటి సమస్యలు ఉంటాయి. ఇంకొందరికి సైనస్ సమస్య ఉంటుంది. అటువంటి వాళ్లు చన్నీళ్లకు కాస్త దూరంగా ఉండటం బెటర్. ముఖ్యంగా చలికాలంలో ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నవాళ్లు చన్నీళ్లతో కంటే గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం బెటర్.ఇక.. రాత్రి పూట నిద్రపోయే సమయంలో స్నానం చేసేవాళ్లు మాత్రం కాసిన్ని గోరు వెచ్చని నీటితో స్నానం చేయొచ్చని… దాని వల్ల శరీరం రిలాక్స్ అవుతుందని… దాని వల్ల నిద్ర కూడా హాయిగా పట్టే అవకాశం ఉంటుందట.

ఇది కూడా చ‌ద‌వండి ==> మీకు గుండె జ‌బ్బులు రాకుండా ఉండాలంటే ప్ర‌తి రోజూ మూడు అర‌టి పండ్లు ఖ‌చ్చితంగా తినండి….!

ఇది కూడా చ‌ద‌వండి ==> ఉప్పు నీటిని గోంతులో పోసుకొని పుక్కిలించ‌డం వ‌ల‌న క‌లిగే ప్ర‌యోజ‌నాలు ?

ఇది కూడా చ‌ద‌వండి ==> Ayurvedic Tea : ఈ ఆయుర్వేద టీని తాగారో.. మీ శరీరంలో వచ్చే మార్పులు చూసి అస్సలు వదలరు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Dates : ఖర్జూరాలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. వద్దన్నా కొనుక్కొని తినేస్తారు..!

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది