Youtube : భారీ షాక్ ఇచ్చిన యూట్యూబ్.. ఇక నుంచి డబ్బులు కట్టాల్సిందే..!
Youtube : స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చిన తర్వాత నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అందునా రోజు మొత్తం సమయమనేదే తెలియకుండా యూట్యూబ్ లో గంటలకొద్దీ గడిపేవారి సంఖ్య అధికమనే చెప్పవచ్చు. అయితే యూట్యూబ్ నుంచి వీరికిప్పుడు షాక్ కొట్టే వార్త ఒకటి వచ్చింది.
ఇక నుంచి యూట్యూబ్లో వీడియోలను మునుపటిలా డౌన్‌లోడ్ చేసుకోవడం కుదరదు. ఒకవేళ మీరు అలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ పక్కా తీసుకోవాల్సిందే. అనగా నెలనెలా డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు లో, మీడియం, హై, ఫుల్ హెచ్‌డీ క్వాలిటీ.. ఇలా ఏ క్వాలిటీ వీడియోనైనా ఆఫ్‌లైన్‌లో ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఉండగా..

Youtube brings premium subscription plan for downloading full hd videos in offline
యూట్యూబ్ తాజా నిర్ణయంతో.. లో, మీడియం క్వాలిటీ వీడియోలను మాత్రమే ఫ్రీ డౌన్‌లోడ్ చేసుకోగలం. ఫుల్ హెచ్ డీ కావాలంటే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. అయితే యూట్యూబ్ తాజా నిర్ణయం పట్ల నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.