Ys Jagan : ఉక్రెయిన్ లో ఉన్న ఏపీ విద్యార్థుల క్షేమం కోసం వైఎస్ జగన్ ఆరాటం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys Jagan : ఉక్రెయిన్ లో ఉన్న ఏపీ విద్యార్థుల క్షేమం కోసం వైఎస్ జగన్ ఆరాటం

 Authored By himanshi | The Telugu News | Updated on :25 February 2022,6:00 pm

Ys Jagan : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా ఉక్రెయిన్ లో ఏం జరుగుతుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల నుండి విద్యార్థులు ఉక్రెయిన్‌ దేశం లో విద్యను అభ్యసిస్తున్నారు. ముఖ్యంగా మెడికల్ విద్య ఆ దేశంలో తక్కువ ఖర్చు ఉండటంతో ఎక్కువ శాతం మంది అక్కడికి వెళ్తున్నారు. మన ఇండియా నుండి కూడా అత్యధికులు ఉక్రెయిన్‌ దేశానికి వెళ్లి చదువుకుంటున్నారు. ఎంతో మంది తెలుగు మెడికల్ విద్యార్థులు ఈ సమయం లో అక్కడ చిక్కుకు పోయారు. యుద్ధం వల్ల అక్కడ ఉన్న మన వాళ్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ సమయంలో తెలుగు వాళ్లు ముఖ్యంగా ఏపీకి చెందిన విద్యార్థులు అక్కడ చిక్కుకోవడం తెలుసుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి వారిని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

యుద్ధం ప్రారంభం కు ముందే ఏపీకి చెందిన విద్యార్థులు అని వెనక్కు వచ్చేయాలని సిందిగా సీఎం జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశాడు. అందుకోసం ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు కూడా నిర్వహించడం జరిగింది. ఏపీ విద్యార్థులను మొత్తం వెనక్కు రప్పించేందుకు జరిగిన ప్రయత్నాలు కొంత మేరకు సఫలమయ్యాయి. యుద్దం మొదలు అవ్వడంతో అక్కడే చిక్కుకుపోయిన వారి విషయంలో కూడా జగన్ ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.తాజాగా సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నతాధికారులతో ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన ఆ విద్యార్థులకు సంబంధించి సమీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అక్కడ ఉన్న విద్యార్థుల పరిస్థితి ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేశారు.

ys jagan review meeting about students stranded in Ukraine

ys jagan review meeting about students stranded in Ukraine

సీఎం జగన్ అక్కడ నుండి విద్యార్థులను ఎట్టి పరిస్థితిలో క్షేమంగా వెనక్కు తీసుకు వస్తా అంటూ విద్యార్థి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. అక్కడే చిక్కుకు పోయిన కొంత మంది విద్యార్థులతో సీఎం జగన్మోహన్ రెడ్డి మరియు ప్రభుత్వ ప్రతినిధులు కొందరు ప్రత్యక్షంగా మాట్లాడటం కూడా జరిగిందట. వారికి ధైర్యాన్ని ఇచ్చిన ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ అక్కడున్న విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చేందుకు నిరంతరాయంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.. దాంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని… జగన్ వారిని తీసుకు వస్తారని నమ్మకంతో ఉన్నారు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది