YS Bharathi Reddy : రాజకీయాలలోకి వైయస్ జగన్ భార్య వైయస్ భారతి రెడ్డి ఎంట్రీ ..!
ప్రధానాంశాలు:
YS Bharathi Reddy : రాజకీయాలలోకి వైయస్ జగన్ భార్య వైయస్ భారతి రెడ్డి ఎంట్రీ ..!
YS Bharathi Reddy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నారు.ఆయన ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల జాతకాలు చెప్పారు.అందులో కొన్ని నిజం అయ్యాయి. మరికొన్ని కాలేదు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. అయినా కూడా వేణు స్వామి జాతకాలు చెబుతూనే ఉన్నారు. ఇక తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతకం చెబుతూ ఆయన భార్య వైయస్ భారతి రెడ్డి గురించి కూడా తెలిపారు. 2024 – 29లో మళ్లీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని, ఆయన విమర్శించనన్నాళ్లు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని అన్నారు.
2024లో కేసీఆర్ లాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి మారబోతున్నారని, అందరిని ఆయన కంట్రోల్లో పెట్టుకుంటారని వేణు స్వామి అన్నారు. అలాగే వైయస్ జగన్మోహన్ రెడ్డి భార్య వైయస్ భారతీ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని అన్నారు. వాళ్లకి రాజకీయాలలోకి వచ్చే అవసరం ఏమాత్రం లేదని అన్నారు. ఇక వైయస్ షర్మిల జాతకరీత్యా తన అన్నకు వ్యతిరేకంగా ఆలోచనలు చేస్తున్నారని అన్నారు. ఏపీలో తన అన్న వెంట వైఎస్ షర్మిల ఉంటే ఎంపీ సీటు వచ్చేది ఆమెకు రాజయోగం పట్టేది. ఇంతలా కష్టపడాల్సిన అవసరం ఆమెకు లేదు. కానీ ఆమె అందుకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు. ఆమె తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టడం వలన ఎటువంటి ఉపయోగం కలగలేదు. ఆమె రాజకీయాలలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఆమె ప్రభావం ఎంత మాత్రం ఉండదు అని అన్నారు.
అదే వైఎస్ షర్మిల తన అన్న వైయస్ జగన్ వెంట ఉంటే ఎంపీ సీటు వచ్చేది తర్వాత రాజ్యసభ సీటు వచ్చేది రాజయోగం అనుభవించేది కానీ ఆమె అందుకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు అన్నారు. సీఎం చెల్లిగా ఆమె కష్టాలు పడాల్సిన అవసరం లేదు, లైఫ్ ని ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు కానీ ఆమె తీసుకుంటున్న నిర్ణయాల వలన ఆమె చాలా కష్టపడుతున్నారు. కానీ ఫలితం దక్కదు అని వేణు స్వామి అన్నారు. ఇక నారా లోకేష్ కు ముఖ్యమంత్రి యోగం లేదని, ఎమ్మెల్యేగా గెలుస్తారని వేణుస్వామి అన్నారు. దీంతో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.