YS Bharathi Reddy : వైయస్ జగన్ పథకాలపై విమర్శలు చేసే వారికి గట్టి కౌంటర్ ఇచ్చిన వైయస్ భారతి…!!
YS Bharathi Reddy : ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులతో పాటు వారి సతీమణులు కూడా జోరుగా ప్రచారాల్లో పాల్గొంటూ వస్తున్నారు. అయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మరియు కోడలు నారా బ్రాహ్మణి పలు కార్యక్రమాలలో పాల్గొంటూ ఆంధ్ర మహిళలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల బాలయ్య చిన్న కూతురు కూడా రాజకీయాల్లోకి దిగి తన నాన్న కోసం ప్రచారాలు చేయడం మొదలుపెట్టింది. ఇక వైయస్ జగన్ తరుపున ఆయన భార్య భారతి ప్రచారాలలో పాల్గొనకపోయినప్పటికీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ ఆంధ్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారారు.
యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వైయస్ భారతి…
అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన వైయస్ భారతి ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ మాట్లాడుతూ వైసీపీ పార్టీకి జగన్ గారికి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా కూడా వ్యతిరేకత రాలేదా..?ఏ సెక్టార్ లో కూడా వ్యతిరేకత రాలేదా..?వచ్చి ఉంటే ఎక్కడ నుండి వచ్చి ఉంటుంది అని మీరు అనుకుంటున్నారని ప్రశ్నించారు. ఇక ఈ ప్రశ్నకు వైయస్ భారతి సమాధానమిస్తూ…నేను కూడా కొన్ని సందర్భాలలో ఈ ప్రశ్నలను విన్నాను. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో నివసించని వారు , ఆంధ్రప్రదేశ్ కు దూరంగా ఉండేవారు పథకాల ధ్వారా ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారని అంటున్నారు. అది ఏమాత్రం వాస్తవం కాదని భారతి కొట్టిి పడేశారు. మనం ఎలాగైతే మన పిల్లలకు విద్య వైద్యం ఆరోగ్యాన్ని అందించాలని కోరుకుంటామో అవన్నీ కూడా అందరికీ అందించాలని కోరుకోవడంలో తప్పులేదు కదా. ఒక పేద పిల్లాడికి చదువుని అందిస్తే వారు చెడిపోతారు అనుకోవడం, సోమరిపోతులు అవుతారు అనుకోవడం సరైనవి కాదు కదా అంటూ భారతి తెలియజేశారు. అలాగే సంక్షేమ పథకాల ద్వారా జగన్ డబ్బులు ఇస్తున్నారని కొంతమంది అంటున్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రజలకు అందిస్తున్న ప్రతి పథకం వెనుక ఒక కారణం ఉందని భారతి తెలిపారు. ఈ నేపథ్యంలోనే వైయస్ఆర్ చేయూత పథకం గురించి మాట్లాడుతూ వైయస్ఆర్ చేయూత పథకం ద్వారా మహిళలకు 4 విడతలలో కొంత డబ్బు అందిస్తున్నారు. అయితే ఈ పథకం ద్వారా ప్రజలు సోమరిపోతులు అవుతారు అనుకోవడం నిజంగా మూర్ఖత్వం. ఎందుకంటే పేదింటి మహిళలు పనికి పోతే తప్ప ఏమి కొనుక్కోలేని పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఆరోగ్యం బాగోలేక కొన్నిసార్లు పనికి వెళ్లకుండా ఉండాల్సి ఉంటుంది. ఆ సమయంలో వారు ఆర్థికంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో చాలామంది మహిళలకు ఈ వైయస్ఆర్ చేయూత పథకం అండగా నిలుస్తుందని భారతి తెలియజేశారు. జగన్ ప్రభుత్వం పై ఈ విధమైన ప్రచారాలు అన్నీ కూడా ప్రతిపక్షాలు ఆలోచన లేకుండా చేస్తున్న మాటలు తప్ప మరేమీ లేదని , రాష్ట్రంలోని ప్రజలను కొన్ని పథకాల ద్వారా ఆదుకోవడం సోమరిపోతులను చేయడం కాదని ఈ సందర్భంగా భారతి చెప్పుకొచ్చారు. దీంతో ప్రస్తుతం రాజకీయాలలో జగన్ పథకాలు ఇస్తూ ప్రజలను సోమరిపోతులను చేస్తున్నాడు అనే వారికి భారతి గట్టి కౌంటర్ ఇచ్చిందని చెప్పాలి.