YS Jagan : వైఎస్ వివేకానంద హత్య కేసులో షర్మిల చేసిన పనికి వైఎస్ జగన్ కి చిక్కులు..?
YS Jagan : 2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏపీ రాజకీయాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. అయితే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా గాని ఈ కేసుకు సంబంధించి సరైన న్యాయం జరగటం లేదని వైయస్ వివేక కూతురు సునీత రెడ్డి ఉన్నత స్థానాలకు వెళ్లి విచారణ కోరడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి అనేక మలుపులు తిరుగుతూ ఉన్నాయి.
ఈ క్రమంలో ఢిల్లీలో సిబిఐ అధికారులకు ఇటీవల వైఎస్ షర్మిల వాంగ్మూలం ఇచ్చారట. ఈ క్రమంలో కడప ఎంపీ టికెట్ కి సంబంధించి తమ కుటుంబంలో వివాదం రాజుకుందని… బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డికి టికెట్ వస్తే కొంతమంది ఉనికి ప్రమాదంలో పడుతుందన్న ఉద్దేశంతో హత్య చేసి ఉంటారని.. షర్మిల అనుమానం వ్యక్తం చేశారట. దీంతో షర్మిల పరోక్షంగా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పాత్రల గురించి ఈ వ్యాఖ్యలు చేసి ఉన్నట్లు కొంతమంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
దీంతో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి తన ప్రభుత్వంపై ప్రతిపక్షాల నుండి విమర్శలు వస్తూ ఉండటంతో షర్మిల ఇచ్చిన తాజా వాంగ్మూలం వైయస్ జగన్ కి చిక్కులు తెచ్చినట్లు ఏపీ రాజకీయాలలో ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఈ విషయమే షర్మిలకు మరియు విజయమ్మకు ఫోన్ చేసి సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా వార్తలొస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఎన్ని సంచలనాలకు దారితీస్తుందో చూడాలి.