Chiranjeevi VS YS Jagan : జగన్ ముందుంది మొసళ్ల పండుగ.. చిరు మాస్ వార్నింగ్
Chiranjeevi VS YS Jagan : ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వం. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో ఉన్నారు. ఈ రెండు పార్టీలకు అస్సలే పడదు. పవన్ కళ్యాణ్ చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తి కావడంతో ఏపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీపై విరుచుకుపడుతోంది. ఇటీవల సినీ ఇండస్ట్రీ గురించి మాట్లాడటానికి సీఎం జగన్ వద్దు పలువురు సినీ పెద్దలు వెళ్లారు. అందులో చిరంజీవి కూడా ఉన్నారు. వయసులో పెద్దవాడు అయినా సీఎం జగన్ కు రెండు చేతులు జోడించి మరీ నమస్కారం పెట్టారు చిరంజీవి. అయినా కూడా ఇండస్ట్రీ మీద సీఎం జగన్ తన కక్షను తీర్చుకుంటూనే ఉన్నారు.
ఈనేపథ్యంలో చిరంజీవి తాజాగా ఏపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చిరంజీవి అంతగా వాళ్లపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదు. టికెట్స్, బెనిఫిట్ షోల విషయంలో ఏపీ ప్రభుత్వం ఇండస్ట్రీని చాలా ఇబ్బందులు పెట్టింది. అవన్నీ గుర్తు చేసుకొని మరీ వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్ లో తాజా రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.కొన్నేళ్లుగా సినీ పరిశ్రమను చుట్టు ముడుతున్న రాజకీయ అంశాలపై మాట్లాడారు. మీ లాంటి వాళ్లు ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలి.
Chiranjeevi VS YS Jagan : చిరు ఏం మాట్లాడారంటే?
పేద వారి కడుపు నింపే దిశగా ఆలోచించాలి. అలా చేస్తే అందరూ మీకు తల వంచి నమస్కరిస్తారు. అంతే కానీ.. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా సినిమా ఇండస్ట్రీ మీద పడతారు ఏంటి అని చురకలు అంటించారు. ఏది ఏమైనా చిరంజీవి.. జగన్ పై ఈ మాత్రం ఘాటు వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటని అందరూ చర్చిస్తున్నారు. మెగా ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.