Beer Lovers : బీర్ ప్రియులకు కిక్ ఇచ్చే న్యూస్..!
ప్రధానాంశాలు:
Beer Lovers : బీర్ ప్రియులకు కిక్ ఇచ్చే న్యూస్..!
Beer Lovers : తెలుగు రాష్ట్రాల్లో బీర్ ప్రియులకు కిక్ ఇచ్చే న్యూస్. త్వరలో కొన్ని ప్రముఖ బీర్ బ్రాండ్ల ధరలు తగ్గనున్నాయి. భారత్–బ్రిటన్ మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల యూకే నుంచి దిగుమతయ్యే బీర్‌పై పన్నులు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా యూకే బీర్ బ్రాండ్లపై పన్ను 75 శాతం వరకు తగ్గించడంతో, వాటి ధరలు భారత మార్కెట్లో పడిపోవడం ఖాయమైంది. దీంతో ఇప్పటివరకు రూ.200కి లభించిన బ్రిటన్ బీర్ బ్రాండ్లు ఇకపై రూ.20 నుంచి రూ.35 తక్కువ ధరకు లభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Beer Lovers : బీర్ ప్రియులకు కిక్ ఇచ్చే న్యూస్..!
వేసవి కాలం మొదలైనప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో బీర్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఎక్సైజ్ శాఖ సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఐదు ప్రముఖ బ్రాండ్లకు అధిక డిమాండ్ ఉన్నట్లు తెలిసింది. ఇటీవల ప్రారంభమైన రూ.99 క్వార్టర్ స్కీం వల్ల బీర్ అమ్మకాలపై స్వల్ప ప్రభావం పడినా, వేడి ఎక్కువ కావడంతో అమ్మకాలు మళ్లీ బాగా పెరిగాయి. ఈ క్రమంలో బ్రిటన్ బ్రాండ్ల ధరలు తగ్గడం బీర్ వినియోగదారులకు అదనపు ఆనందాన్ని కలిగించనుంది. అయితే ఇది అన్ని బీర్లకూ వర్తించదని, కేవలం యూకే దిగుమతులకే వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
భారతీయ బీర్ మార్కెట్ విలువ ఇప్పటికే రూ.50,000 కోట్లకు చేరుకుంది. ఇది ప్రతి సంవత్సరం 8-10 శాతం వృద్ధి రేటుతో అభివృద్ధి చెందుతోంది. కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసినా, రాష్ట్రాల ఎక్సైజ్ డ్యూటీ మరియు వ్యాట్ పన్నులు వేరు కావడంతో, ధర తగ్గింపులో వ్యత్యాసం ఉండే అవకాశముంది. అయినప్పటికీ, యూకే బీర్ బ్రాండ్లు ఇతర దేశాల బ్రాండ్లతో పోలిస్తే మరింత అందుబాటులోకి రావడం ఖాయం. బీర్ ప్రియులకు ఇది కిక్ ఇచ్చే న్యూస్ అనే చెప్పాలి.