Pawan Kalyan : రాపోలు మోసానికి బుద్ది చెప్పి ప‌వ‌న్ క‌ళ్యాన్‌ కు జై కొట్టిన జనాలు.. ఇదో గొప్ప మార్పు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan Kalyan : రాపోలు మోసానికి బుద్ది చెప్పి ప‌వ‌న్ క‌ళ్యాన్‌ కు జై కొట్టిన జనాలు.. ఇదో గొప్ప మార్పు

 Authored By himanshi | The Telugu News | Updated on :22 February 2021,5:30 pm

Pawan Kalyan : ఏపీ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. అయితే కొన్ని చోట్ల అధికార పార్టీకి ఊహించని ఓటములు చవిచూడాల్సి వచ్చింది. అధికార పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట అనూహ్యంగా ఓటమి చవిచూశారు. జనసేన తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక అనధికారికంగా వైకాపా లో జాయిన్ అయ్యాడు. అధికార పార్టీకి దగ్గరగా ఉంటున్న రాపాక కు ఈ పంచాయతీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటర్లు షాక్ ఇచ్చారు.

Pawan Kalyan : చివరి దశ ఎన్నికల్లో రాపాక కు పరాభవం

rajolu people big shock to rapaka prasad

rajolu people big shock to rapaka prasad

ఏపీలో చివరి దశ ఎన్నికల్లో రాపాక చాలా నమ్మకం పెట్టుకున్న పంచాయితీ లు పరాభవం పాలయ్యాయి. వైకాపా బలపర్చిన వారు అక్కడ పలువురు ఓటమి పాలు అయ్యారు. రాపాక పై కోపం తో అక్కడి జనాలు ప‌వ‌న్ క‌ళ్యాన్‌ పార్టీ జనసేన బలపర్చిన సర్పంచ్ లను గెలిపించారు. ప‌వ‌న్ క‌ళ్యాన్‌ పార్టీ తరపున పోటీ చేసి గెలిచి ఇప్పుడు జగన్ వెంట నడవడం పై చాలా మంది విమర్శలు చేస్తున్నారు. అందులో భాగంగానే రాపాక ను ఎన్నికల్లో ఓడించారు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

రాజోలు నియోజకవర్గం లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఈ ఫలితాలతో క్లారిటీ వచ్చేసింది. రకరకాలుగా జనసేన ప్రచారం చేయడం తో పాటు సానుభూతి కూడా పనిచేసి రాపాక పై కోపం తో అక్కడి ఓటర్లు జనసేన వారికి ఓట్లు వేసి గెలిపించారు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాపాక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరింతగా దెబ్బ తినే అవకాశం ఉంది అంటూ రాజకీయ వర్గాలు వారు అంటున్నారు. ఇప్పటికి అయిన రాపాక తన తప్పును తెలుసుకోవాలని జనసేన కార్యకర్తలు అంటున్నారు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది