Revanth Reddy VS Harish Rao : ఆ పాపంలో హరీశ్ రావు కూడా భాగస్వామే అన్న రేవంత్.. మా వల్లనే మీ పార్టీ గెలిచిందన్న హరీశ్
Revanth Reddy VS Harish Rao : పదే పదే గత పాలన గురించి మాట్లాడుతున్నారు. గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సింగిల్ విండో డైరెక్టర్ గా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిందే కేసీఆర్. గత పాలనలో ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ. గత పాలనలో షిప్పింగ్ మినిస్ట్రీ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కార్మిక […]
ప్రధానాంశాలు:
అసెంబ్లీలో వాడీవేడీగా చర్చ
హరీశ్ రావు, రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం
ఆ పాపాల్లో మీకూ భాగస్వామ్యం ఉందన్న రేవంత్ రెడ్డి
Revanth Reddy VS Harish Rao : పదే పదే గత పాలన గురించి మాట్లాడుతున్నారు. గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సింగిల్ విండో డైరెక్టర్ గా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిందే కేసీఆర్. గత పాలనలో ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ. గత పాలనలో షిప్పింగ్ మినిస్ట్రీ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కార్మిక శాఖ మంత్రి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు.. వైఎస్సార్ హయాంలో ఎమ్మెల్యే కాకుండానే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పోతిరెడ్డిపాడు రంధ్రం పెద్దగా చేసినప్పుడు నాయిని నర్సింహారెడ్డి కడప జిల్లా ఇన్ చార్జ్ మినిస్టర్. ఆ రోజు కొట్లాడింది పీ జనార్ధన్ రెడ్డి. పోతిరెడ్డిపాడు రంధ్రం పెద్దగా చేసినప్పుడు ఇక్కడున్న వాళ్లు ఎవ్వరూ మాట్లాడలేదు. ప్రాణం త్యాగం చేయలేదు. మీరు సమయం ఇస్తే.. 55 ఏళ్ల పాలన మీద చర్చ పెడదాం. ఈరోజు ఇక్కడ జరుగుతున్న చర్చ జూన్ 2, 2014 నుంచి జరిగిన పాలన, చేసిన విధ్వంసం, నాయకత్వం వ్యవహార శైలి మీద మనం ఈరోజు మాట్లాడుతున్నాం. వారికి గతం గురించి చర్చించాలనే కోరిక ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. గతంలో జరిగిన పరిపాలనలో ఇక్కడున్న వాళ్లకు పాత్ర లేకపోవచ్చు కానీ.. అక్కడున్న వాళ్లకు చాలా పాత్ర ఉంది. ప్రత్యక్షంగా మంత్రులుగా పని చేశారు. అక్కడున్న దానం నాగేందర్, శ్రీనివాస్ యాదవ్, హరీశ్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, గంగుల కమలాకర్ అన్ని పేర్లు లిస్టు చదువుతా. వీళ్లంతా ఏ రోజు పాపాలు జరిగినాయి అని అంటున్నారో.. ఆ పాపాల్లో వాళ్ల భాగస్వామ్యం వాళ్లదే ఉంది అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
గవర్నర్ ప్రసంగంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే పొందుపరిచారట. సీనియర్ ఎమ్మెల్యేనే అలా అనడం బాధాకరం. మంత్రి వర్గంలో పార్టీ మేనిఫెస్టోను చర్చించి.. మా ప్రభుత్వం భవిష్యత్తు కార్యాచరణను మంత్రివర్గం ఆమోదం చేసిన తర్వాత గవర్నర్ ప్రసంగిస్తారు. గతంలో పాలన అనుభవం ఉన్నవాళ్లు కూడా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకో.. మరి దేనికి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 5 ఏళ్ల సమయం ఉంది. సంపూర్ణంగా ఎక్కడెక్కడ ఏం ఉన్నయో అన్నీ వివరిస్తాం. జరిగిన విధ్వంసం ఏంటి.. ఆర్థిక నేరం ఏంటి.. అన్ని విషయాలు ఈ సభలోనే తమరి అనుమతితో చర్చిద్దాం. మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన తీర్మానం కాబట్టి అభివృద్ధి కావాలంటే సంయమనం పాటించండి. మేము పాలక పక్షంగా మా విజన్ ను ముందు పెడుతున్నాం. మీరు సలహాలు, సూచనలు ఇవ్వండి. ప్రతిపక్షాలను గౌరవించే సంప్రదాయం కాంగ్రెస్ కు ఉంది.. అన్నారు.
Revanth Reddy VS Harish Rao : రేవంత్ కు కౌంటర్ ఇచ్చిన హరీశ్
ఆ తర్వాత సీఎం ప్రసంగంపై హరీశ్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. మేము పొత్తు పెట్టుకోవడం వల్లనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీరేదో మాకు పదవులు ఇవ్వలేదు. చాలా రికార్డులు సెట్ చేయాలి అధ్యక్ష. కేసీఆర్ ను వాళ్లు ఎంపీని చేశారట. కేసీఆర్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు సోనియా గాంధీ అధ్యక్షతన యూపీఏ సమావేశం జరిగింది. అప్పుడు కేంద్ర మంత్రి వర్గంలో కేసీఆర్ ను చేరమన్నప్పుడు కేసీఆర్ ఒక్కటే చెప్పారు. నేను పదవుల కోసం రాలేదు.. తెలంగాణ కోసం డిల్లీకి వచ్చా అన్నారు. కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టాలని చెప్పడంతో ఆరోజు పార్లమెంట్ లో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ అన్నారు హరీశ్ రావు.