Heavy Rains : భారీ వ‌ర్షాల ఎఫెక్ట్.. ఏకంగా 30 రైళ్లు ర‌ద్దు చేసిన రైల్వే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Heavy Rains : భారీ వ‌ర్షాల ఎఫెక్ట్.. ఏకంగా 30 రైళ్లు ర‌ద్దు చేసిన రైల్వే..!

Heavy Rains : ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌తో తెలుగు రాష్ట్రాలు అల్ల‌క‌ల్లోలంగా మారాయి. వ‌ర్షాల‌కి రోడ్లు అన్ని జ‌ల‌మ‌యం అయ్యాయి. వానలు, వరదల బీభత్సం పెరుగుతున్నాయి.. దీంతో వాతావరణ శాఖ హై అలర్ట్ జారీ చేసంది.. రెండు తెలుగురాష్ట్రాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. తెలంగాణలోని 11 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. అలాగే ఏపీలోని 8 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీచేశారు. దీంతో ప్రభుత్వ, అధికార యంత్రాంగాలు సహాయకచర్యల కోసం […]

 Authored By ramu | The Telugu News | Updated on :1 September 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Heavy Rains : భారీ వ‌ర్షాల ఎఫెక్ట్.. ఏకంగా 30 రైళ్లు ర‌ద్దు చేసిన రైల్వే..!

Heavy Rains : ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌తో తెలుగు రాష్ట్రాలు అల్ల‌క‌ల్లోలంగా మారాయి. వ‌ర్షాల‌కి రోడ్లు అన్ని జ‌ల‌మ‌యం అయ్యాయి. వానలు, వరదల బీభత్సం పెరుగుతున్నాయి.. దీంతో వాతావరణ శాఖ హై అలర్ట్ జారీ చేసంది.. రెండు తెలుగురాష్ట్రాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. తెలంగాణలోని 11 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. అలాగే ఏపీలోని 8 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీచేశారు. దీంతో ప్రభుత్వ, అధికార యంత్రాంగాలు సహాయకచర్యల కోసం సన్నద్ధం అయ్యాయి. ఎడతెరిపిలేని వర్షంతో పలు చోట్ల రహదారులు, రైల్వే ట్రాక్‌లు చెరువులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ డివిజన్‌ పరిధిలో పలు రైళ్లు రద్దయ్యాయి.. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది.. భద్రతా కారణాల రీత్యా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Heavy Rains  రైళ్లు ర‌ద్దు..

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే 30కిపైగా రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా, కొన్ని రైళ్లను దారిమళ్లించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది. అత్యవసర సాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించింది. ఆదివారం, సోమవారంలో దాదాపు 30 వరకు రైళ్లు రద్దయ్యాయి. మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విజయవాడ-కాజీపేట మార్గంలో 24 రైళ్లు నిలిపివేసింది.. సింహాద్రి, మచిలీపట్నం, గంగా-కావేరి, సంఘమిత్ర, గౌతమి, చార్మినార్, యశ్వంత్‌పూర్ రైళ్లు నిలిపివేశారు.

Heavy Rains భారీ వ‌ర్షాల ఎఫెక్ట్ ఏకంగా 30 రైళ్లు ర‌ద్దు చేసిన రైల్వే

Heavy Rains : భారీ వ‌ర్షాల ఎఫెక్ట్.. ఏకంగా 30 రైళ్లు ర‌ద్దు చేసిన రైల్వే..!

సికింద్రాబాద్, విజయవాడ, గుంటూరు మార్గాల్లో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.. పలు మార్గాల్లో రైలు పట్టాలమీదకు నీళ్లు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే పేర్కొంది. ఇదిలాఉంటే.. భారీ వర్షాలతో NH-16పై కూడా రాకపోకలు బంద్‌ అయ్యాయి. నల్లగొండ, కృష్ణా జిల్లాలలో రికార్డు వర్షాలతో వరద బీభత్సం కొనసాగుతోంది.. దీంతో NH-16పై రాకపోకలు బంద్‌ చేశారు. ట్రాఫిక్‌ ను పలు మార్గాల్లో మళ్లిస్తున్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది