Telangana Elections Results 2023 : రేవంత్ ను కలిసిన తెలంగాణ డీజీపీ.. గెలుపు దిశగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ అభ్యర్థులు వీళ్లే..!
ప్రధానాంశాలు:
Telangana Elections Results 2023 : రేవంత్ ను కలిసిన తెలంగాణ డీజీపీ..
Telangana Elections Results 2023 గెలుపు దిశగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ అభ్యర్థులు వీళ్లే..!
Telangana Elections Results 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది. 65 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్ లో ఉండగా, బీఆర్ఎస్ 42 స్థానాల్లో లీడ్ లో ఉంది. బీజేపీ 8 స్థానాలు, ఎంఐఎం 4 స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి. ఇక.. తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ యాదవ్, సీపీలు మహేశ్ భగవత్, సంజయ్ కుమార్ జైన్ రేవంత్ రెడ్డిని కలిసి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు.
ఇక.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధాన అభ్యర్థులు గెలుపు దిశగా ఉన్నారు. కొడంగల్, కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి, కోదాడ నుంచి పద్మా ఉత్తమ్ రెడ్డి, హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మధిర నుంచి భట్టి విక్రమార్క, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వర రావు,
పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంథని నుంచి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి షబ్బీర్ అలీ ఆధిక్యంలో ఉన్నారు. నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి కొడుకు జయవీర్ లీడ్ లో ఉన్నారు.
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిగారిని కలిసిన డీజీపీ అంజనీ కుమార్, మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్. #Congress #TelanganaElections #ElectionResults pic.twitter.com/8KyhLEb3Hr
— Suresh PRO (@SureshPRO_) December 3, 2023