Chandrababu Naidu : వైజాగ్ బ్రోకర్ విజయసాయిరెడ్డి… వామ్మో చంద్రబాబుకు ఇంత ఆవేశమా..?
Chandrababu Naidu : విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం ఇప్పడు ఆంధ్రాలో హాట్ టాపిక్ అవుతుంది. దీనిపై సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ రాసి అఖిలపక్షముతో వచ్చి కలుస్తాము , అవకాశం ఇవ్వండి అంటూ అడగటం జరిగింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రమైన విమర్శలు చేశాడు. ఏ1 ఏ2 విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మకానికి పెట్టారు. లేఖల పేరుతో మోసం చేయటం కాదు, జగన్ కి చిత్తశుద్ది ఉంటే రాజీనామా చేయాలి. జగన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, వైజాగ్ బ్రోకర్ విజయసాయిరెడ్డి కలిసి తమ స్వప్రయోజనాల కోసం విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టారు.
విధ్వంసానికి మారుపేరైన వైసీపీ నేతలు మొదట ప్రజాధాని అమరావతిపై భస్మాసుర హస్తం మోపారు, ఇప్పుడు విశాఖపట్నాన్ని నాశనం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ పై ప్రధానికి లేఖల పేరుతో దొంగనాటకాలాడుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు ఏ1, ఏ2 ప్రయత్నిస్తున్నారు. జగన్ అబద్దాల కోరు, నెల రోజుల క్రితం కేంద్రానికి లేఖరాసి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు మీ దొంగనాటకాల్ని కేంద్రం బట్టబయలు చేయటంతో, ప్రజలకు మీ నిజస్వరూపం తెలియడంతో ఎన్నికల నేపద్యంలో ఇప్పుడు మరో లేఖ రాసి మోసం చేయాలని చూస్తున్నారు.
Chandrababu Naidu : అసలు ఈ లేఖల వల్ల ఉపయోగం ఏంటి?
తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన విశాఖ ఉక్కు కోసం ప్రభుత్వంతో ఎటువంటి షరతులు లేకుండా కలసి పనిచేయడానికి సిద్దమని పల్లా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ కోసం చేసిన దీక్షకు సంఘీభావం తెలిపినరోజు మేం స్పష్టంగా చెప్పాం. జగన్ లేఖ రాసేబదులు ప్రధానితో నేరుగా పోన్లో ఎందుకు మాట్లాడటం లేదు? మీ కేసుల మాఫీ కోసం ఇచ్చిన ప్రాధాన్యత తెలుగు ప్రజల ఆత్మగౌరవమైన విశాఖ ఉక్కుకి ఇవ్వరా? అంటూ బాబు నిప్పులు చెరిగాడు.
జనవరి 27 నే స్టీల్ ప్లాంట్ పై నిర్ణయం తీసుకున్నామని ఈవిషయం జగన్ ప్రభుత్వానికి తెలిసి కూడా దాచిపెట్టిందని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం ప్రకటించటం మీ దివాలుకోరుతనానికి నిదర్శనం కాదా? ముఖ్యమంత్రి ప్రమేయం, సహకారంతోనే పోస్కోతో ఒప్పందం జరిగింది వాస్తవం. పిబ్రవరి 6 న ప్రధానికి మెదటి లేఖ రాశావు, అప్పటి నుంచి నెల రోజులలో జగన్ రెడ్డి, 28 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేట్ పరం కాకుండా అడ్డుకునేందుకు ఏం చేశారు?
Chandrababu Naidu : ఈ నెల రోజుల్లో కేంద్రంపై ఏ విధంగా ఒత్తిడి చేశారు?
మీ కేసులపై ఉన్న శ్రద్దలో కనీసం ఒక్క శాతమైన స్టీల్ ప్లాంట్ పై ఉందా? అధికార పార్టీ నేతలు ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు. వైసీపీ ఎంపీల, ఏపీ ప్రభుత్వ వైఫల్యానికి జగన్ రెడ్డి నైతిక బాద్యత వహిస్తూ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. కళ్ల బొల్లి మాటలతో ప్రజలను మోసం చేయటం కాకుండా రాజీనామా చేసి డిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్రమంత్రులను కలవాలి. జగన్ రెడ్డి నియంతలా ప్రవర్తించడం మానేసి తాడేపల్లి ప్యాలెస్ నుండి బయటకు వచ్చి నిరసనకారులతో భుజం భుజం కలిపి నిలబడాలి.
జగన్ రెడ్డి తన కేసుల కోసం తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడు.విశాఖ ప్రజలు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి చేస్తున్న పోరాటానికి భయపడి ప్రజలను మోసం చేయడానికి ఇప్పుడు మరో లేఖ రాశాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలు అర్పించిన వారి త్యాగాలను వైసీపీ అవమానించింది. వైసీపీకి తెలుగు ప్రజలకు ప్రాతినిధ్యం వహించే హక్కు లేదు. ముఖ్యమంత్రి రాజీనామా చేసి విశాఖపట్నం ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అంటూ చంద్రబాబు ఘాటైన వ్యాఖ్యలు చేశాడు . మరి దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.