Kashmir Pahalgam : చంపొద్దని వేడుకున్నా.. విశాఖవాసిని వదలని ఉగ్రవాది..వెంటాడి మరీ కాల్చేశారు
ప్రధానాంశాలు:
Kashmir Pahalgam : చంపొద్దని వేడుకున్నా.. విశాఖవాసిని వదలని ఉగ్రవాది..వెంటాడి మరీ కాల్చేశారు
Kashmir Pahalgam : జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ లోయలో kashmir pahalgam జరిగిన ఉగ్రదాడి terror attack దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. పర్యాటకులతో నిండిన బైసరన్ లోయ వద్ద టెర్రరిస్టులు అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభించడంతో ఒక్కసారిగా హడావిడి ఏర్పడింది. మహిళలు, పిల్లలను వదిలిపెట్టి ప్రత్యేకంగా పురుషులను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడి కారణంగా జమ్మూకశ్మీర్‌లో పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింది.

Kashmir Pahalgam : చంపొద్దని వేడుకున్నా.. విశాఖవాసిని వదలని ఉగ్రవాది..వెంటాడి మరీ కాల్చేశారు
Kashmir Pahalgam : పహల్గామ్ ఉగ్రదాడికి సూత్రధారి ఇతడేనా?
ఈ దారుణ దాడిలో విశాఖపట్నానికి చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. అతను ప్రాణ భయంతో పరుగులు తీస్తున్నా ఉగ్రవాదులు వెంటాడి మరీ కాల్చినట్లు తెలుస్తోంది. చంపొద్దని వేడుకున్నా వినకుండా చంద్రమౌళిని హత్య చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. చంద్రమౌళి మృతదేహాన్ని సహా పర్యాటకులు గుర్తించగా, కుటుంబసభ్యులు వెంటనే విశాఖపట్నం నుంచి పహల్గాంకు బయల్దేరారు. ఆయన మృతదేహాన్ని మధ్యాహ్నం 12 గంటలకు విశాఖకు విమానంలో తీసుకురానున్నారు.
ఇక మరోవైపు హైదరాబాద్‌కు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మనీశ్ రంజన్ ఈ దాడిలో మరణించిన మరో బాధితుడు. కోఠిలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న ఆయన కుటుంబంతో కలిసి పర్యటనకు వెళ్లిన సమయంలో ఈ దాడికి గురయ్యారు. ఐడీ కార్డు చూసి ఆయనను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని కాల్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనను మధ్యలోనే విరమించి భారత్‌కు చేరుకున్నారు. పహల్గామ్ దాడి వెనుక లష్కరే తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా సాజిద్ జట్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. NIA ఇతడిని అత్యంత ప్రమాదకర ఉగ్రవాదిగా పేర్కొంది.