Ys jagan : మ‌ళ్లీ అధికారంపై జ‌గ‌న్ ధీమా.. కార‌ణం ఇదే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ys jagan : మ‌ళ్లీ అధికారంపై జ‌గ‌న్ ధీమా.. కార‌ణం ఇదే..!

Ys jagan : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధ్యక్షుడు వై.ఎస్. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రతి చర్య ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసేందుకు ఉద్దేశించినదేనని ఆయ‌న ఆరోపించారు. గ‌డిచిన మంగ‌ళ‌వారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఉమ్మ‌డి విశాఖపట్నం జిల్లాలోని మాడుగుల, అంకపల్లి మరియు చోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల నుండి ఎన్నికైన ప్రజా ప్రతినిధులతో జగన్ మోహన్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :15 August 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Ys jagan : మ‌ళ్లీ అధికారంపై జ‌గ‌న్ ధీమా.. కార‌ణం ఇదే..!

Ys jagan : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధ్యక్షుడు వై.ఎస్. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రతి చర్య ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసేందుకు ఉద్దేశించినదేనని ఆయ‌న ఆరోపించారు. గ‌డిచిన మంగ‌ళ‌వారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఉమ్మ‌డి విశాఖపట్నం జిల్లాలోని మాడుగుల, అంకపల్లి మరియు చోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల నుండి ఎన్నికైన ప్రజా ప్రతినిధులతో జగన్ మోహన్ రెడ్డి స‌మావేశ‌మై ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టాల్సిన తీరును వివ‌రించారు. COVID-19 మహమ్మారి, తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, YSRCP మ్యానిఫెస్టోలో చేసిన వాగ్దానాలలో 99 శాతం విజయవంతంగా అమలు చేసిన‌ట్లు చెప్పారు. తామెప్పుడూఊ సాకులు చెప్పలేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టో త‌మ‌కు పవిత్ర గ్రంథం అన్నారు.

రైతు భరోసా, అమ్మ ఒడి, సున్నా-వడ్డీ రుణాలు, విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్‌మెంట్), మత్స్యకార భరోసా, వాహన మిత్ర వంటి కీలక కార్యక్రమాలను నిలిపివేయడం లేదా అస‌మ‌గ్రంగా నిర్వహించడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీలు తిరిగి రావడం మరియు పంటల బీమా ప్రీమియంలను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లను మరింత పెంచుతాయ‌న్నారు.ఏపీలో రెండు పార్టీల వ్యవస్థ కొన‌సాగుతోంది. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ కూటమికి వైఎస్ఆర్‌సీపీకి మధ్యే భారీ పోటీ ఉండే అవకాశాలు ఉంటాయ‌ని అంటున్నారు. జగన్ ధీమా ఏంటంటే టీడీపీ కూటమి సూపర్ సిక్స్ చేయలేదు. అదే సమయంలో అభివృద్ధి చేయాలంటే పెద్ద ఎత్తున డ‌బ్బులు కావాలి. అదంతా ఈజీ కాదు. అప్పుల తిప్పలు వేరేగా ఉంటాయి. దాంతో టీడీపీ కూటమి ఫెయిల్ అయి 2029 నాటికి అధికారం తమ చేతికి దక్కుతుందని జగన్ అంచనా వేసుకుంటున్నారు.

దానికి ఉదాహరణగా తమిళనాడు ఎన్నికలను ఆయన తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఇప్పటికి మూడున్నర దశాబ్దాల క్రితం తమిళనాడులో 1991 నుంచి 1996 మధ్యలో చూస్తే విపక్ష కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే దారుణమైన ఓటమి పాలైంది. జయలలిత నాయకత్వంలోని ఏఐఏడీఎంకే స్వీప్ చేసింది. విపక్ష హోదా కూడా దక్కలేదు. అదే 1996కి వచ్చేసరికి మొత్తం రివర్స్ అయింది. డీఎంకే స్వీప్ చేసింది. ఆ లెక్కలే ఇపుడు జగన్ ని ఉత్సాహాన్ని ఇస్తున్నాయని అంటున్నారు.1991లో జరిగిన ఎన్నికల్లో ఏఐఏడీఎంకే ఏకంగా 59.8 శాతం ఓటు షేర్ తో 225 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. ఇది మొత్తం 234 ఉన్న అసెంబ్లీలో కేవలం తొమ్మిది సీట్లు తక్కువగా సాధించిన విజయం. ఆ ఎన్నికల్లో డీఎంకేకు కేవలం రెండంటే రెండు సీట్లు మాత్రమే దక్కాయి. ఇక ఏఐడీఎంకేకు 160 సీట్లు వస్తే కూటమితో చేరిన కాంగ్రెస్ కి 60 సీట్లు, ఐసీఎస్ కి 1 సీటు వ‌చ్చింది. డీఎంకే కూటమికి 7 సీట్లు వస్తే అందులో డీఎంకేకు 2, టీఎంకేకి 2, సీపీఎంకి 1, సీపీఐకి 1, జేడీకి 1 సీటు ద‌క్కింది. పీఎంకేకు 1, ఇండిపెండెంట్ కి 1 దక్కింది.

Ys jagan మ‌ళ్లీ అధికారంపై జ‌గ‌న్ ధీమా కార‌ణం ఇదే

Ys jagan : మ‌ళ్లీ అధికారంపై జ‌గ‌న్ ధీమా.. కార‌ణం ఇదే..!

ఈ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే కూటమికి 59.8 శాతం ఓటు షేర్ దక్కితే డీఎంకే కూటమికి 30 శాతం ఓటు షేర్ మాత్రమే దక్కింది. మరి రెట్టింపు ఓటు షేర్ తేడా ఉన్నా 1996లో చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయింది. 1996లో చూస్తే కనుక డీఎంకే కూటమి మొత్తం 234 అసెంబ్లీ సీట్లకు గానూ 221 సీట్లను గెలుచుకుని స్వీప్ చేసి పారేసింది.ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమికి 53.77 శాతం ఓటు షేర్ దక్కింది. డీఎంకేకు 173 సీట్లు కూటమిలోని టీఎంసీకి 39,సీపీఐకి 7, ఏఐఎఫ్ బీకి 1 సీటు దక్కాయి. ఇక ఏఐఏడీఎంకే కూటమికి 27.08 ఓటు షేర్ తో కేవలం 4 సీట్లు దక్కాయి. ఇందులో ఏఐఏడీఎంకేకి 4 సీట్లు వస్తే కాంగ్రెస్ కి జీరో సీట్లు వచ్చాయి.

అలాగే ఎండీఎంకే కూటమికి రెండు సీట్లు 7.89 శాతంతో దక్కగా, పీఎంకే అలియన్స్ కి 4.61 ఓటు షేర్ తో 4 సీట్లు, ఇతరులకు మూడు సీట్లు దక్కాయి. తమిళనాడు చరిత్రలో ఇంత దారుణమైన పరాభవం అన్నది రెండు సార్లు రెండు కీలకమైన ప్రాంతీయ పార్టీలు ఎదుర్కొన్నాయి. అంతే కాదు మరో రెండు సార్లు అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇపుడు ఆ లెక్కలతోనే జగన్ ధీమాగా ఉన్నారు అని అంటున్నారు. ఏపీ రాజకీయాలు కూడా తమిళనాడు మాదిరిగా రెండు ప్రాంతీయ పార్టీల చుట్టూ తిరగడంతో 2029 రిజల్ట్స్ ఎలా ఉంటాయో అన్న ఉత్కంఠకు ఇప్ప‌టి నుంచే తెర‌లేచింది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది