Ys Jagan : జ‌గ‌న్‌కి స‌పోర్ట్‌గా ఎవ‌రు ఉన్నారు.. వెన్నుపోటు పొడిచేదెవ‌రు ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ys Jagan : జ‌గ‌న్‌కి స‌పోర్ట్‌గా ఎవ‌రు ఉన్నారు.. వెన్నుపోటు పొడిచేదెవ‌రు ?

Ys Jagan : వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పార్టీలో ప్రక్షాళన మొదలుపెట్టారు. వైఎస్సార్‌సీపీ రైతు, మహిళా, మైనారిటీ, న్యాయ, గ్రీవెన్స్‌ విభాగాల అధ్యక్షులను నియమించారు.. ఈ పదవుల్లో ప్రస్తుతం ఉన్నవారినే కొనసాగిస్తున్నారు. అయితే జ‌గ‌న్‌కి స‌పోర్ట‌ర్స్ ఎవ‌రు, వెన్నుపోటు పొడిచేదెవ‌రు అనే విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. చంద్రబాబు సైతం నాడు పార్టీని నిలబెట్టుకునేందుకు ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. గెలుపు ఓటములు అంతా అధినేతల మీదనే పోతోంది. వారే ఆ క్రెడిట్ ని అయినా […]

 Authored By ramu | The Telugu News | Updated on :27 August 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Ys Jagan : జ‌గ‌న్‌కి స‌పోర్ట్‌గా ఎవ‌రు ఉన్నారు.. వెన్నుపోటు పొడిచేదెవ‌రు ?

Ys Jagan : వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పార్టీలో ప్రక్షాళన మొదలుపెట్టారు. వైఎస్సార్‌సీపీ రైతు, మహిళా, మైనారిటీ, న్యాయ, గ్రీవెన్స్‌ విభాగాల అధ్యక్షులను నియమించారు.. ఈ పదవుల్లో ప్రస్తుతం ఉన్నవారినే కొనసాగిస్తున్నారు. అయితే జ‌గ‌న్‌కి స‌పోర్ట‌ర్స్ ఎవ‌రు, వెన్నుపోటు పొడిచేదెవ‌రు అనే విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. చంద్రబాబు సైతం నాడు పార్టీని నిలబెట్టుకునేందుకు ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. గెలుపు ఓటములు అంతా అధినేతల మీదనే పోతోంది. వారే ఆ క్రెడిట్ ని అయినా లేక ఓటమిని అయినా తీసుకోవాల్సి వస్తోంది. తెలంగాణాలో కేసీఆర్ లాంటి అపర చాణక్యుడు కూడా పార్టీని ఖాళీ చేసి నేతలు పోతూంటే ఏమీ చేయలేకపోతున్నారు.

Ys Jagan ఎవ‌రు బెస్ట్..

జగన్ కి ఈ కష్టకాలంలో అండగా ఉన్న నేతలు ఎవరూ అన్నది ఒక్కసారి చూసుకుంటే కనుక ఇద్దరు ముగ్గురు నేతలు మాత్రమే కనిపిస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. వీరే గతంలో పార్టీలో కొంత వరకూ చక్రం తిప్పారు. జగన్ కి అన్ని విధాలుగా నీడగా ఉంటూ వచ్చారు. వీరు తప్పించి జిల్లా స్థాయిలలో పెద్ద లీడర్లు అనిపించుకున్న వారు ఎవరూ ముఖం చూపించడం లేదు అని అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నపుడు అంతా తామే అని అని చక్రాలు గిర్రున తిప్పిన వారు అయితే ఇపుడు కంటికి క‌నిపించ‌కుండా పోయారు. అధికారంలో ఉన్నపుడు ముఖ్యమంత్రి జగన్ కి వెరీ క్లోజ్ అని చెప్పుకున్న వారు అంతా కూడా ఇప్పుడు ఎక్క‌డ ఉన్నార‌నే చ‌ర్చ వైసీపీలో న‌డుస్తుంది.

Ys Jagan జ‌గ‌న్‌కి స‌పోర్ట్‌గా ఎవ‌రు ఉన్నారు వెన్నుపోటు పొడిచేదెవ‌రు

Ys Jagan : జ‌గ‌న్‌కి స‌పోర్ట్‌గా ఎవ‌రు ఉన్నారు.. వెన్నుపోటు పొడిచేదెవ‌రు ?

అయితే జ‌గ‌న్ ఇప్పుడు ఎక్క‌డికి వెళ్లిన కూడా ఆయ‌న వెంట నేతలు ఎవ‌రు కూడా క‌నిపించ‌డం లేదు. జగన్ పక్కన ఉంటే తమ మీద కూడా కేసులు ఎక్కడ పెడతారో అన్న భయంతో పాటు ఏపీలో ఉంటే అధినాయకత్వానికి సన్నిహితంగా ఉంటే పార్టీ ఖర్చులు పెరుగుతాయని ముందస్తు జాగ్రత్తలతోనే కొంద‌రు వెన‌క్కి వెన‌క్కి వెళుతున్నార‌నే చ‌ర్చ న‌డుస్తుంది. మ‌రి కొంద‌రు జ‌గ‌న్‌కి వెన్ను పోటు పొడిచే ప్లాన్‌లో ఉన్నార‌ని స‌మాచారం. జ‌గ‌న్ మాత్రం పార్టీకి వెన్నుద‌న్నుగా నిలిచిన వారికి 2029లో అవకాశాలు ఉంటాయని కూడా ఆయన కచ్చితంగా చెబుతున్నట్లుగా తెల్సుతోంది. మొత్తానికి వైసీపీ హై కమాండ్ కి ఓడితే కానీ క‌ళ్లు తెర‌వ‌డం లేదు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది