Prakasham..టీడీపీ సంస్థాగత ఎన్నికలు షురూ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేడు తెలంగాణలో కనబడకుండా పోగా, విభజిత ఏపీలో ప్రతిపక్ష హోదాలో ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలోనైనా అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సంస్థాగతంగా టీడీపీని బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. జిల్లాలోని కందుకూరు నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించనున్నారు. కందుకూరు మాజీ శాసన సభ్యుడు డాక్టర్ దివి శివరాం ఆధ్వర్యంలో నూతన కమిటీల ఎంపిక సోమ, మంగళవారాల్లో నిర్వహించనున్నట్లు టీడీపీ నెల్లూరు పార్లమెంటు అధికార ప్రతినిధి గోచిపాతెల మోషె సోమవారం తెలిపారు.
సోమవారం గుడ్లూరు, లింగసముద్రం, ఉలవపాడు, మంగళవారం కందుకూరు, వలేటివారిపాలెం కమిటీల ఎన్నిక జరగనుంది. ఇకపోతే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోగా, కేడర్ కూడా దాదాపుగా వెళ్లిపోయింది. విభజిత ఏపీలో ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీ అధికార వైసీపీపై పోరాటం చేస్తున్నది. టీడీపీ భావినేతగా నారా లోకేశ్ ఉంటారని ఆ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.