Prakasham..జిల్లాలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్.. కలెక్టర్ ప్రకటన | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prakasham..జిల్లాలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్.. కలెక్టర్ ప్రకటన

 Authored By praveen | The Telugu News | Updated on :11 September 2021,5:13 pm

ఏపీలోని పలు జిల్లాల్లో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దాంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారు అప్రమత్తమై పలు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రజలు మస్ట్‌గా వ్యాక్సిన్ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే, కొందరు టీకా తీసుకోవడం పట్ల ప్రారంభంలో ఆసక్తి చూపలేదు. కానీ, ప్రస్తుతం టీకాలు తీసుకునేందుకు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ శని, ఆదివారాల్లో నిర్వహిస్తున్నట్లు శనివారం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. డిస్ట్రిక్ట్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో పని చేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌తో పాటు ప్రజలకు కూడా వ్యాక్సిన్ అందజేయనున్నారు. స్కూల్స్ ప్రారంభం అయిన నేపథ్యంలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు టీకా ముఖ్యమని అధికారులు పేర్కొంటున్నారు.

ఈ క్రమంలోనే గ్రామ, వార్డు సచివాలయాల్లో 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. రెండో డోసు వ్యాక్సిన్ కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందన్నారు. ఇకపోతే వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ప్రతీ ఒక్కరు మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం కంపల్సరీగా పాటించాలని అధికారులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

 

 

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది