Prakaasham..రెండో దశలో జిల్లాలో 1,028 పాఠశాలల అభివృద్ధి
వైసీపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘నాడు-నేడు’ ప్రోగ్రాం ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ పథకం రెండో దశలో భాగంగా జిల్లాలో 1,028 పాఠశాలలను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి విజయభాస్కర్ శనివారం తెలిపారు. ఇందుకు సంబంధించిన పనులను నవంబర్ 1న ప్రారంభించి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికల్లా పూర్తి చేయాలని ఆదేశాలు ఆల్రెడీ ఇచ్చినట్లు డీఈవో పేర్కొన్నారు. ‘నాడు-నేడు’ ప్రోగ్రాం ద్వారా మొదటి దశలో ఇప్పటికే 1,256 స్కూల్స్‌లో వర్క్స్ పూర్తి చేసినట్లు వివరించారు. ఇక పాఠశాలల్లో త్వరలో తల్లిదండ్రుల కమిటీలు ఎన్నుకుని, వారికి ఆయా స్కూల్స్‌లో పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించనున్నట్లు పేర్కొన్నారు.
పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రయారిటీ ఇస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు జిల్లాల్లో నాడు నేడు పథకం ద్వారా విద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రకాశం జిల్లాతో పాటు ఏపీలోని ఇతర జిల్లాల్లోనూ విద్యాలయాల్లో నాడు నేడు రెండో దశ పనులు షురూ కానున్నాయి.