Prakaasham..‘అక్షర భారత్ – అక్షర వెలుగు విద్యా ప్రాజెక్టు’ శిక్షణా కేంద్రం ప్రారంభం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prakaasham..‘అక్షర భారత్ – అక్షర వెలుగు విద్యా ప్రాజెక్టు’ శిక్షణా కేంద్రం ప్రారంభం

 Authored By praveen | The Telugu News | Updated on :12 September 2021,3:44 pm

జిల్లాలోని ఉలవపాడులో అభి హెల్ప్ లైన్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి సహకారంతో ‘అక్షర భారత్ – అక్షర వెలుగు విద్యా ప్రాజెక్టు’ శిక్షణా కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ శిక్షణా కేంద్రం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చనున్నారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడానికే ఈ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వైసీపీ నాయకులు రామాల సింగారెడ్డి తెలిపారు. సింగారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చొచ్చని, ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు.

 

వైసీపీ సర్కారు అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నదని తెలిపారు. ఇకపోతే వైసీపీ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఉన్న సంగతి అందరికీ విదితమే. ‘నాడు-నేడు’ ప్రోగ్రాం ద్వారా ఏపీలోని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ఈ పథకం తొలి దశ పూర్తి చేయగా, రెండో దశ కింద పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.

 

 

 

 

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది