Prakasham..లోక్ అదాలత్‌తో 8,653 కేసులు కొలిక్కి..
జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో 8,653 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పివి జ్యోతిర్మయి ఆదివారం తెలిపారు. లోక్ అదాలత్‌లో పాల్గొనేందుకు కక్షిదారులు ముందుకొచ్చినట్లు పేర్కొన్నారు. సాల్వ్ అయిన కేసుల్లో 263 సివిల్ కేసులు, 8,267 క్రిమనల్ కేసులు, పీఎల్సీ 33 ఉన్నాయని చెప్పారు. ఒంగోలులో అత్యధికంగా 2,787 కేసులు పరిష్కారమయినట్లు వివరించారు. ఇకపోతే రాజీపడిన కేసులలో కక్షిదారుల మధ్య దాదాపు రూ.5.10 కోట్లు చెల్లించుకునేలా ఒప్పిందం కుదిరినట్లు జ్యోతిర్మయి పేర్కొన్నారు. ఇటీవల కాలంలో కేసులు బాగా పెరిగిపోతున్నాయని, భూమి, ఇతర విషయాల్లో తగాదాలు ఎక్కువవుతున్నాయని, ఈ క్రమంలోనే లోక్ అదాలత్‌లు నిర్వహించి సమస్యల పరిష్కరానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
అయితే, సమస్యల పరిష్కారానికి కక్షిదారుల కాన్సెంట్ ముఖ్యం కాబట్టి వారిని ఒప్పించాల్సి ఉంటుంది. ఇరువైపుల కక్షిదారులు ఒప్పుకుంటూ డిస్పూట్స్ క్లియర్ అయ్యే చాన్సెస్ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే సమస్యల పరిష్కారాని కక్షిదారులు ముందుకు రావాల్సి ఉండటంతో పాటు జిల్లా న్యాయమూర్తుల వద్ద లోక్ అదాలత్ సందర్భంగా హాజరు కావాల్సి ఉంటుంది.