Chor Bazaar Movie Review : చోర్ బజార్ మూవీ ఫస్ట్ రివ్యూ ..!
Chor Bazaar Movie Review : చోర్ బజార్ అనేది ఎంత ఫేమస్ పదమో అందరికీ తెలుసు. చాలా ప్రాంతాల్లో చోర్ బజార్స్ ఉంటాయి. అక్కడ దొంగతనం చేసిన వస్తువులనే అమ్ముతుంటారు. అదే పేరుతో తాజాగా ఓ సినిమా వస్తోంది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ పూరీ హీరోగా వస్తున్న సినిమా పేరు చోర్ బజార్. ఆంధ్రా పూరీ, మెహబూబా, రొమాంటిక్ అంటూ ఆకాశ్ పూరీ హీరోగా మూడు నాలుగు సినిమాల్లో నటించినప్పటికీ ఆకాశ్ కు హీరోగా అయితే హిట్ పడలేదు. నిజానికి.. ఆకాశ్ నటించిన అన్ని సినిమాల్లో ఏదో ఒక విధంగా పూరీ జగన్నాథ్ ఇన్వాల్వ్ అయ్యేవాడు.
కానీ.. తాజాగా చోర్ బజార్ అనే సినిమాలో మాత్రం ఇన్వాల్వ్ కాలేదు. ఈ సినిమాకు జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. జార్జ్ రెడ్డి మూవీ డైరెక్టరే ఈ సినిమాకు డైరెక్టర్. ఈ సినిమాను లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. ఈ సినిమాలో పూరీ ఆకాశ్ సరసన గెహన సిప్పీ హీరోయిన్ గా నటించింది. వీఎస్ రాజు ఈ సినిమాకు ప్రొడ్యూసర్. ఐవీ ప్రొడక్షన్స్ పతాకంపై సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, సునీల్, సంపూర్ణేశ్ బాబు ముఖ్య పాత్రలో నటించారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించాడు. ఈ సినిమాలో ఆకాశ్ పూరీ బచ్చన్ సాబ్ గా నటించగా.. సిప్పీ సిమ్రాన్ గా నటించింది.
Chor Bazaar Movie Review : ప్రేక్షకుల అంచనాలను చోర్ బజార్ అందుకుంటుందా?
ఈ సినిమా ఇంకొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే.. హైదరాబాద్ లో పాతబస్తీలో ఉన్న చోర్ బజార్ అనే ప్రాంతంలో జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. చోర్ బజార్ అనే ఏరియా ఇప్పటిది కాదు. నిజాం కాలం నాటి నుంచి ఉంది. 400 ఏళ్ల నుంచి ఆ ప్రాంతానికి చోర్ బజార్ అనే పేరు. అక్కడ దొంగతనం చేసి తీసుకొచ్చిన వస్తువులను చాలా తక్కువ ధరకే అమ్ముతారు. ఆ నేపథ్యంలోనే ఈ సినిమా కూడా సాగుతుంది. ఇంకొద్ది సేపట్లో సినిమా ప్రీమియర్స్ యూఎస్ లో ప్రారంభం కానున్నాయి. సినిమా లైవ్ అప్ డేట్స్ కోసం ది తెలుగు న్యూస్ వెబ్ సైట్ ను ఫాలో అవుతూ ఉండండి.
చోర్ బజార్ అనేది ఒక గ్యాంగ్ స్టర్ కు సంబంధించిన సినిమా. ఆ గ్యాంగ్ స్టర్ ఎవరో కాదు.. బచ్చన్ పాండే(ఆకాశ్ పూరీ). సినిమా ప్రారంభమే గ్యాంగ్ స్టర్ గురించి చెబుతారు. చోర్ బజార్ లో దొంగతనం చేస్తూ ఉంటాడు బచ్చన్. ఇంతలో తనకు ఒక మూగ అమ్మాయి పరిచయం అవుతుంది. మరోవైపు ఓ డైమండ్ ను దొంగతనం చేయడం కోసం డీల్ కుదుర్చుకుంటాడు బచ్చన్. అప్పుడే తన లైఫ్ టర్న్ అవుతుంది. హీరో ఇంట్రడక్షన్ తర్వాత ఒక్కో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ జరుగుతూ ఉంటుంది. సునీల్, సంపూర్ణేశ్ బాబు, సుబ్బరాజు క్యారెక్టర్లు కూడా సినిమాకు ప్లస్ పాయింట్ ఖరీదైన డైమండ్ ను దొంగలించడంతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది.
ఫస్ట్ హాఫ్ మొత్తం సరదాగా సాగిపోతుంది. బచ్చన్ ఇంట్రడక్షన్ నుంచి.. తను కార్ల టైర్లను అమ్ముకొని బతుకుతూ.. చివరకు బంగారం, వజ్రాల దొంగగా ఎలా మారాడో చూపిస్తారు. సెకండ్ హాఫ్ లో తను వజ్రం దొంగలించడం వల్ల తన లైఫ్ కష్టాల్లో పడుతుంది. మధ్యలో మూగ అమ్మాయితో లవ్ ట్రాక్ కూడా ఉంటుంది. తర్వాత ఆ వజ్రం వల్ల హీరో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు. హీరోయిన్ తో లవ్ ఓకే అవుతుందా? అనేదే సెకండ్ హాఫ్ లో చూపిస్తారు. మొత్తానికి హీరోగా.. పూరీ ఆకాశ్ ఈ సినిమాతో నిలదొక్కుకున్నట్టే. చోర్ బజార్ అనే ఒక ప్రాంతంలో ఈ సినిమా మొత్తం జరగడం వల్ల ఈ సినిమాకు చోర్ బజార్ అనే పేరు పెట్టారు.