Bheemla Nayak Movie Review : భీమ్లా నాయక్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bheemla Nayak Movie Review : భీమ్లా నాయక్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!

Bheemla Nayak Movie Review : భీమ్లా నాయక్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ ..  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25న గ్రాండ్ గా రిలీజ్ అయింది. నిజానికి ఏ సినిమా అయినా ఉదయం బెనిఫిట్ షోలతో రిలీజ్ అవుతుంది. కానీ.. ఇది పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి.. ఇప్పటికే అర్ధరాత్రి నుంచే బెనిఫిట్ షోలు ప్రారంభం అయ్యాయి. యూఎస్ తో పాటే ఇండియాలో కూడా బెనిఫిట్ షోలు అప్పటికే […]

 Authored By aruna | The Telugu News | Updated on :25 February 2022,2:32 am

Bheemla Nayak Movie Review : భీమ్లా నాయక్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ ..  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25న గ్రాండ్ గా రిలీజ్ అయింది. నిజానికి ఏ సినిమా అయినా ఉదయం బెనిఫిట్ షోలతో రిలీజ్ అవుతుంది. కానీ.. ఇది పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి.. ఇప్పటికే అర్ధరాత్రి నుంచే బెనిఫిట్ షోలు ప్రారంభం అయ్యాయి. యూఎస్ తో పాటే ఇండియాలో కూడా బెనిఫిట్ షోలు అప్పటికే వేయడంతో సినిమాను చూసిన పవర్ స్టార్ అభిమానులు ఉర్రూతలూగిపోతున్నారు.ఈ సినిమా అయ్యప్పనుమ్ కోషియమ్ అనే మలయాళం సినిమాకు రీమేక్. వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మరో మూవీ ఇది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్ నటించగా.. విలన్ గా రానా దగ్గుబాటి నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్. డైరెక్టర్ సాగర్ కే చంద్ర. ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ, రన్ టైమ్ 2 గంటలా 25 నిమిషాలు. ఇక సినిమా లైవ్ అప్ డేట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సినిమా ప్రారంభమే రానా డైలాగ్ తో మొదలవుతుంది. ఏంటి బాలాజీ స్పీడ్ పెంచావ్ అంటాడు రానా. అదే సమయంలో రానాను పోలీసులు కొడుతుంటారు. అప్పుడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఉంటుంది.

Pawan Kalyan Bheemla Naayak Movie review and live updates

Pawan Kalyan Bheemla Naayak Movie review and live updates

ఇంతలో ఇద్దరి మధ్య డైలాగుల యుద్ధం నడుస్తుంది. అవి కూడా ఈగో డైలాగ్స్. పవన్ కళ్యాణ్ పై అధికారిగా మురళీ శర్మ నటించాడు. పవన్ కళ్యాణ్ భార్యగా నిత్యా మీనన్ నటించింది. రానా.. మాజీ ఎంపీ కొడుకు. రానాను అరెస్ట్ చేసి పవన్ కళ్యాణ్ కోర్టులో ప్రవేశపెడతాడు.

రానా పేరు డేనియల్. నన్ను అరెస్ట్ చేసి కోర్టు దాకా తీసుకొస్తావా అని పవన్ కళ్యాణ్ పై కోపం పెంచుకుంటాడు రానా. ఆ తర్వాత బీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ వస్తుంది. ఈ పాటలో సునీల్, హైపర్ ఆది, సప్తగిరి కూడా ఉంటారు.

జైలు నుంచి రానా విడుదలవుతాడు. పోలీస్ స్టేషన్ లో ఉన్న సమయంలో సీక్రెట్ గా తీసిన ఓ వీడియోను రానా లీక్ చేస్తాడు. ఈ సినిమాలో రానాతో పాటు విలన్ కూడా ఉంటాడు. అతడే రావు రమేశ్. ఈయనకు కూడా పవన్ కళ్యాణ్ అంటే పడదు. దీంతో రానాతో చేతులు కలుపుతాడు. రానాతో కలిసి పవన్ కళ్యాణ్ పై పగ తీర్చుకోవాలని అనుకుంటాడు.

అయితే.. పోలీస్ స్టేషన్ లో మద్యం బాటిల్ ను ఓపెన్ చేసినందుకు భీమ్లా నాయక్ ను అరెస్ట్ చేస్తారు. దాని వెనుక ఉన్నది రానానే. దీంతో రానాను వదలకూడదని నిత్యా మీనన్.. భీమ్లా నాయక్ తో చెబుతుంది. దీంతో జైలు నుంచి బయటికి వచ్చాక తన పగను తీర్చుకుంటాడు. ఆ తర్వాత లాలా.. భీమ్లా అనే పాట వస్తుంది. పాట తర్వాత డేనియల్, భీమ్లా నాయక్.. ఇద్దరూ తలపడతారు. ఇద్దరి మధ్య కాసేపు ఫైట్ సీన్లు ఉంటాయి. ఆ సమయంలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్ గా ఉంటుంది. ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ అయిపోతుంది.

ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉంది. ప్రీ ఇంటర్వల్ లో భీమ్లా నాయక్, డేనియల్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. అలాగే రావు రమేశ్ కామెడీ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో రెండు పాటలు ఉన్నాయి. సౌండ్ మిక్సింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం వీక్ గా ఉన్నట్టు అనిపిస్తోంది.

సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. భీమ్లా నాయక్ భార్య నిత్యా మీనన్ ను కిడ్నాప్ చేస్తారు. దీంతో అది డేనియల్ పనే అని భావించి వెంటనే డేనియల్ ఇంటికి వెళ్తాడు భీమ్లా నాయక్. అతడికి వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే భీమ్లా నాయక్ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. తను పోలీస్ కాకముందు అడవిలో ఉన్న తండా కొక్కిలి దేవరకు లీడర్ గా ఉండేవాడు. అదే సమయంతో నిత్యా మీనన్ ను అరెస్ట్ చేస్తారు.

దీంతో డేనియల్ ఇంటికి వెళ్లి తండాలో తనతో కలిసి ఫైట్ చేయాలని చాలెంజ్ విసురుతాడు భీమ్లా నాయక్.ఫ్లాష్ బ్యాక్ లో సముద్రఖని ఉంటాడు. ఆయన డైలాగ్స్ సూపర్ గా ఉన్నాయి. హిస్టరీ ఎప్పుడు గెలిచినోడే రాస్తాడు.. మనం గెలిచాక చెరిపి రాసుకోవచ్చు.. అంటూ సముద్రఖని చెబుతాడు. ఆ తర్వాత అడవి తల్లి పాట వస్తుంది.

సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఉండే ఫ్లాష్ బ్యాక్ కొద్ది   సేపు ఉంటుంది కానీ.. అదిరిపోతుంది. ఆ తర్వాత సినిమా చివరి 30 నిమిషాలు కూడా అంతే. సినిమాకు ఆ 30 నిమిషాలు కీలకం. బ్యాంక్ టు బ్యాక్ పవర్ ప్యాక్డ్ సీన్లు లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో వస్తాయి. ఆ తర్వాత క్లైమాక్స్ ఫైట్ అద్భుతం. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. ఒక మంచి సందేశంతో సినిమా ముగుస్తుంది…

Bheemla Nayak Movie Review: ఫైనల్ రిపోర్ట్

మొత్తానికి చెప్పొచ్చేదేంటంటే.. భీమ్లానాయక్ సూపర్ హిట్ సినిమా. ఈ సినిమాకు కథ కూడా బలమే. అయితే.. ఒరిజనల్ మూవీ మలయాళంలో ఉన్న కథను రానా దగ్గుబాటి కోసం ఇక్కడ కొన్ని మార్పులు చేశారు. ఆ మార్పుల వల్ల సినిమా కథకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఈ సినిమాకు క్లైమాక్స్ సూపర్. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా క్లైమాక్స్ ను అద్భుతంగా రూపొందించారు…

పూర్తి కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి.. ===> భీమ్లా నాయక్ మూవీ రివ్యూ, రేటింగ్‌..!

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది