Bheemla Nayak Movie Review : పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మూవీ రివ్యూ, రేటింగ్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bheemla Nayak Movie Review : పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మూవీ రివ్యూ, రేటింగ్‌..!

 Authored By aruna | The Telugu News | Updated on :25 February 2022,4:56 am

Bheemla Nayak Movie Review : పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మూవీ రివ్యూ, రేటింగ్‌.. వకీల్ సాబ్ సినిమా తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ సినిమా వెండి తెర మీద ఆడలేదు. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలోకి వచ్చిన వకీల్ సాబ్ మూవీ సంచలనాలను సృష్టించింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమాకు బాగా హైప్ రావడానికి ప్రధాన కారణం.. కిన్నెర మొగిలయ్య పాడిన టైటిల్ సాంగ్. అలాగే ఈ సినిమాలో మరోసారి పోలీస్ ఆఫీసర్ గా పవన్ కనిపించబోతుండటం.. దానికి తోడు.. రానా దగ్గుబాటిని విలన్ గా తీసుకోవడంతో ఈ సినిమాకు విపరీతంగా హైప్ వచ్చింది.

ఈ సినిమాకు దర్శకత్వం వహించకపోయినా.. సినిమా దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలతో పాటు తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథను మార్చడంతో ప్రముఖ పాత్ర పోషించాడు త్రివిక్రమ్. మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్.. ఇలా ప్రముఖమైన వాళ్లు ఈసినిమాకు పనిచేయడంతో ఈ సినిమాకు విపరీతంగా క్రేజ్ పెరిగింది. భారీ అంచనాల నడుమ భీమా నాయక్ ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ విడుదలైంది. ఇప్పటికే యూఎస్ తో పాటు ఇండియాలో కూడా ప్రీమియర్ షోలను ఏర్పాటు చేశారు. అభిమానుల కోసం బెనిఫిట్ షోలను కూడా వేశారు. మరి.. మలయాళం సినిమా అయ్యప్పన్ కోషియానం సినిమాకు రీమేక్ గా వచ్చిన భీమ్లా నాయక్.. తెలుగు ప్రేక్షకులను మెప్పించాడా? లేదా? అనేది తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.

Pawan Kalyan Bheemla Nayak review and rating in telugu

Pawan Kalyan Bheemla Nayak review and rating in telugu

Bheemla Nayak Movie Review : సినిమా కథ ఇదే

నిజానికి.. ఇది మలయాళం సినిమా రిమేక్ కావడంతో కథ ముందే అందరికీ తెలిసి ఉంటుంది. దాదాపుగా మలయాళం సినిమా కథనే ఇందులోనూ ఉంటుంది కానీ.. తెలుగులో త్రివిక్రమ్ కొన్ని మార్పులు చేశారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులు చేశారు. అలాగే.. సినిమాలో విలన్ గా నటించిన రానా దగ్గుబాటి కోసం కథలో కొన్ని మార్పులు చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పేరు భీమ్లా నాయక్. విలన్ రానా దగ్గుబాటి పేరు డేనియల్ శేఖర్. కానీ.. అందరూ డేనియల్ అని పిలుస్తుంటారు. పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా.. రానా రాజకీయ నాయకుడిగా నటించాడు. సినిమా స్టార్టింగే రానా డైలాగ్స్ తో ప్రారంభం అవుతుంది. ఎందుకంటే అప్పటికే భీమ్లా నాయక్.. డేనియల్ ను అరెస్ట్ చేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో భీమ్లా నాయక్ కు డేనియల్ పట్టుబడతాడు. దీంతో అతడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి పోలీసులతో కొట్టిస్తాడు డేనియల్. అదే డేనియల్, భీమ్లా నాయక్ మధ్య గొడవలకు ఆజ్యం పోస్తుంది.

ఏంటి బాలాజీ స్పీడ్ పెంచావు అంటూ రానా డైలాగ్ చెప్పడం.. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఉంటుంది. భీమ్లా నాయక్ పోలీస్ గా ఎంట్రీ కాగానే.. రానాకు డైలాగులతో బుద్ధి చెబుతాడు. ఇద్దరి మధ్య డైలాగులు పేలుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ హైయ్యర్ ఆఫీసర్ గా మురళీ శర్మ నటించాడు.
రానాను అరెస్ట్ చేసి పోలీసులతో కొట్టించడమే కాదు.. కోర్టు దాకా తీసుకెళ్తాడు భీమ్లా నాయక్. ఇది సహించని డేనియల్ ఎలాగైనా భీమ్లా నాయక్ అంతు చూడాలని అనుకుంటాడు. కొన్ని రోజులు జైలులో గడిపిన తర్వాత జైలు నుంచి విడుదలైన డానీ.. భీమ్లా నాయక్ పై ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఎదురు చూస్తుంటాడు.

Bheemla Nayak Movie Review : సినిమా పేరు : భీమ్లా నాయక్
తారాగణం : పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, సమ్యుక్త మీనన్, సముద్రఖని, రావు రమేశ్ తదితరులు
డైరెక్టర్ : సాగర్ కే చంద్ర
నిర్మాత : సూర్య దేవర నాగ వంశీ
మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్ తమన్
సినిమాటోగ్రఫీ : రవి కె చంద్రన్
బ్యానర్ : సితార ఎంటర్ టైన్ మెంట్స్
రన్ టైమ్ : 2 గంటల 25 నిమిషాలు
విడుదల తేదీ : 25 ఫిబ్రవరి 2022

అయితే.. డేనియల్.. పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు ఓ సీక్రెట్ వీడియో తీస్తాడు. దాన్ని తను జైలు నుంచి బయటికి వచ్చాక లీక్ చేస్తాడు. మరోవైపు రావు రమేశ్ కు కూడా భీమ్లా నాయక్ అంటే పడదు. దీంతో డేనియల్ తో రావు రమేశ్ చేతులు కలుపుతాడు.మరోవైపు భీమ్లా నాయక్ ఎక్కడ దొరుకుతాడా అని వెయిట్ చేస్తున్న డేనియల్ కు.. భీమ్లా నాయక్ పోలీస్ స్టేషన్ లో అడ్డంగా దొరికిపోతాడు. పోలీస్ స్టేషన్ లో లిక్కర్ బాటిల్ ను ఓపెన్ చేసినందుకు భీమ్లా నాయక్ ను అరెస్ట్ చేస్తారు. ఇదంతా ప్లాన్ చేయించింది డేనియలే.
భీమ్లా నాయక్ భార్యగా నటించిన నిత్యా మీనన్.. అతడిని అస్సలు వదలొద్దని భీమ్లాకు చెబుతుంది.  తో నిత్యా మీనన్ ను కూడా డేనియల్ కిడ్నాప్ చేయిస్తాడు. జైలు నుంచి భీమ్లా నాయక్ విడుదలయ్యాక.. నేరుగా డాని ఇంటికి వెళ్తాడు. అక్కడ డేనియల్ కు చాలెంజ్ విసురుతాడు భీమ్లా. తనతో పాటు తండాలో ఫైట్ చేయాలంటూ చాలెంజ్ చేస్తాడు.

అప్పుడు ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. అసలు.. కొక్కిలి దేవర తండాకు, భీమ్లా నాయక్ కు ఉన్న సంబంధం ఏంటి? కొక్కిలి దేవర తండాకు, భీమ్లా నాయక్ ఎలా లీడర్ అయ్యాడు? సముద్రఖని ఎవరు? డేనియల్ ను తండాకు ఎందుకు రమ్మంటాడు? నిత్యా మీనన్ ఎవరు? రావు రమేశ్ తో భీమ్లా నాయక్ కు ఉన్న పగ ఎప్పటిది? చివరికి డేనియల్ ను భీమ్లా నాయక్ ఎలా మట్టి కరిపిస్తాడు.. అనేదే మిగితా కథ.

Bheemla Nayak Movie Review : విశ్లేషణ

సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు స్క్రీన్ ప్లేను రాసింది మాత్రం త్రివిక్రమ్. ఇక.. సినిమా ముఖ్యంగా ఇద్దరు వేర్వేరు భావాలు కల.. వేర్వేరు క్యారెక్టర్స్ ఉన్న వ్యక్తుల మధ్య జరిగే కథ. ఈ ఇద్దరి తర్వాత ఈ సినిమాలో మరో ముఖ్యమైన క్యారెక్టర్ నిత్యా మీనన్(సుగుణ)ది. మలయాళం రీమేక్ అయినప్పటికీ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా రూపొందించారు. యాజ్ యూజ్ వల్ గా సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర అదుర్స్. పోలీస్ గెటప్ లో పవన్ కళ్యాణ్ అదరగొట్టేశాడు. ఫైట్స్ విషయంలో కానీ.. డైలాగ్స్ డెలివరీ విషయంలో కానీ.. పవన్ కళ్యాణ్ రూటే సపరేటు. విలన్ గా రానా కూడా బాగా యాక్ట్ చేశాడు. తన విలనిజాన్ని చూపించాడు. పవన్ కళ్యాణ్ తో పోటీ పడి మరీ నటించాడు. ఢీ అంటే ఢీ అన్నాడు. భీమ్లా నాయక్ భార్యగా నిత్యా మీనన్ అదరగొట్టేసింది. సినిమాకు బ్యాక్ గ్రౌడ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది.

Bheemla Nayak Movie Review : ప్లస్ పాయింట్స్

సినిమాకు ప్లస్ పాయింట్స్ హీరో, విలన్. ఇద్దరి పోరాట దృశ్యాలు.
సెకండ్ హాఫ్
భీమ్లా నాయక్ ఫ్లాష్ బ్యాక్
క్లైమాక్స్
లాస్ట్ 30 నిమిషాల సినిమా
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్

Bheemla Nayak Movie Review : మైనస్ పాయింట్స్

ఫస్ట్ హాఫ్
కథలో కొన్ని మార్పులు

Bheemla Nayak Movie Review : కన్ క్లూజన్

చివరగా చెప్పొచ్చేది ఏంటంటే.. పవన్ కళ్యాణ్ అభిమానులు.. ఆయన నుంచి ఏం కోరుకుంటున్నారో.. అదే ఈ సినిమాలో ఇచ్చారు. పోలీస్ గెటప్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్.. అన్నీ కలిపి పవర్ ప్యాక్డ్ గా పవన్ కళ్యాణ్.. భీమ్లా నాయక్ సినిమాతో తన అభిమానులను అలరించారు. కాబట్టి.. ఈ సినిమాను నిశ్చింతగా పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు.. అందరూ చూడొచ్చు.
The Telugu News Rating : 3.25/5

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది