Romantic Movie Review : ‘రొమాంటిక్’ మూవీ రివ్యూ.. యూత్ ఎంటర్‌టైనర్‌‌తో ఆకాశ్ పూరీకి ఫస్ట్ హిట్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Romantic Movie Review : ‘రొమాంటిక్’ మూవీ రివ్యూ.. యూత్ ఎంటర్‌టైనర్‌‌తో ఆకాశ్ పూరీకి ఫస్ట్ హిట్..

 Authored By praveen | The Telugu News | Updated on :29 October 2021,11:44 am

Romantic Movie Review : డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘మెహబూబా’ చిత్రంతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశాడు. అయితే, ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. దాంతో మూడేళ్ల పాటు గ్యాప్ తీసుకున్న ఆకాశ్ ప్రజెంట్ ‘రొమాంటిక్’గా వెండితెరపై కనిపించాడు. పూరీ జగన్నాథ్ స్టోరి, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించగా, ‘రొమాంటిక్’ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ శిష్యుడు అనిల్ పాదూరి డైరెక్ట్ చేశాడు. ఈ ఫిల్మ్ శుక్రవారం విడుదలై డబుల్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్నది. టాలీవుడ్ డైరెక్టర్స్‌తో పాటు సెలబ్రిటీలు ఈ సినిమాను చూసి మెచ్చుకుంటున్నారు.

Romantic Movie Review

Romantic Movie Review

Romantic Movie Review: అదిరిపోయిన ఆకాశ్, కేతిక కెమిస్ట్రీ..
ఫిల్మ్ : రొమాంటిక్
నటీనటులు : ఆకాష్ పూరీ, కేతిక శర్మ, రమ్య కృష్ణ
ప్రొడ్యూసర్: పూరీ జగన్నాథ్
డైరెక్షన్ : అనిల్ పాదూరి
మ్యూజిక్ : సునీల్ కశ్యప్
రిలీజ్ డేట్ : అక్టోబర్ 29, 2021

‘రొమాంటిక్ ’ ఫిల్మ్ స్టోరి విషయానికొస్తే..పోలీస్ ఆఫీసర్ రోల్ ప్లే చేసిన రమ్య గోవారికర్ (రమ్య కృష్ణ) పాయింట్ ఆఫ్ వ్యూతో సినిమా స్టార్ట్ అవుతుంది. గోవా నుంచి ప్రారంభమైన ఈ కథలో వాస్కోడగామా (ఆకాశ్ పూరీ) స్మగ్లర్. ఓ రౌడీ గ్యాంగ్‌లో చేరిన తర్వాత వాస్కోడగామా బాగానే డెవలప్ అవుతాడు. ఈ క్రమంలోనే వాస్కోడగామాకు మౌనిక(కేతిక శర్మ) పరిచయమవుతుంది. అలా పరిచయమైన వీరి మధ్య ప్రేమ కథ ఏంటి? నిజానికి అది ప్రేమనేనా? వాస్కోడగామా చేసిన తప్పుల నుంచి ఎలా బయటపడతాడు.. వాస్కోడగామా, మౌనిక చివరికి కలుస్తారా అనే విషయాలు తెలియాలంటే సిల్వర్ స్క్రీన్‌పై సినిమా చూడాల్సిందే.

Romantic Movie Review నటనలో ఓ మెట్టెక్కిన ఆకాశ్..

పూరీ జగన్నాథ్ తన తనయుడి గురించి సినిమా ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ ఆకాశ్ మంచి యాక్టర్ అని చెప్పాడు. ఆ మాటలు నిజమే అని నిరూపించాడు ఆకాశ్ పూరీ. ‘రొమాంటిక్’ మూవీలో ఆకాశ్ యాక్టింగ్ బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. నటన పరంగా ఓ మెట్టు ఎక్కాడు ఆకాశ్. ఇకపోతే హీరోయిన్ కేతిక శర్మకు ఇది మొదటి సినిమానే అయినప్పటికీ చాలా బాగా చేసింది. ఇక ‘బాహుబలి’ శివగామిదేవి రమ్యకృష్ణ పోలీసు ఆఫీసర్ రోల్‌లో ఇరగదీసిందని చెప్పొచ్చు. హీరో ఫ్రెండ్ రోల్ ప్లే చేసిన దేవియానిశర్మ పర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలిచింది. ఉత్తేజ్, సునైనా, మకరంద్ దేశ్ పాండే చాలా బాగా సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు.

Romantic Movie Review

Romantic Movie Review

సినిమా చూస్తున్నంత సేపు పూరీ జగన్నాథ్ స్టైల్ టెంప్లేట్, సీన్స్ , డైలాగ్స్ కనబడుతుంటాయి. ఎందుకంటే అనిల్ పాదూరి పూరీ జగన్నాథ్ శిష్యుడు అవడమే కాకుండా, హీరో పూరీ జగన్నాథ్ తనయుడు కూడా. ఈ నేపథ్యంలోనే ‘రొమాంటిక్’ సినిమా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘హార్ట్ ఎటాక్, 143’ సినిమాల్లాగా అనిపిస్తున్నాయని కొందరు ప్రేక్షకులు  చర్చించుకుంటున్నారు. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ అందించిన మ్యూజిక్ సీన్స్ బాగా ఎలివేట్ అవడంలో తోడయింది. డైరెక్టర్ అనిల్‌కు ఇది మొదటి సినిమా అయినప్పటికీ చాలా ఎక్స్‌పీరియెన్స్ ఉన్న డైరెక్టర్ లాగా సబ్జెక్ట్‌ను డీల్ చేశాడని, ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాను ఎంగేజింగ్‌గా తీశాడని ప్రేక్షకులు చెప్తున్నారు.

ప్లస్ పాయింట్స్ :
హీరో హీరోయిన్ కెమిస్ట్రీ
డైలాగ్స్
ఎలివేషన్స్

మైనస్ పాయింట్స్:

సినిమా చూస్తున్నంత సేపు చాలా ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా యూత్‌కు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. అయితే, ఎక్కడో పూరీ మార్క్ కనిపించడం లేదని కొందరు అంటున్నారు.

ట్యాగ్ లైన్ : పూరీ జగన్నాథ్ ‘రొమాంటిక్’ సైడ్ అదిరిపోయింది. డీసెంట్ సినిమాగా సూపర్ హిట్ గ్యారంటీ.. !

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది