Vikram Movie Review : విక్ర‌మ్ మూవీ రివ్యూ.. వ‌న్ మ్యాన్ షో | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Vikram Movie Review : విక్ర‌మ్ మూవీ రివ్యూ.. వ‌న్ మ్యాన్ షో

Vikram Movie Review : విలక్షణ నటుడు, లోకనాయకుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ విజయ్ సేతుపతి, సూర్య ముగ్గురు కలిసి లీడ్ రోల్స్ చేసిన మూవీ విక్రమ్.. ఈ సినిమా జూన్ 3న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పెద్ద హీరోలు నటించడంతో విక్రమ్ మూవీపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఖైదీ వంటి చిత్రాన్నితెర‌కెక్కించిన లోకేష్ ఈ చిత్రాన్ని కూడా అద్భుతంగా తెర‌కెక్కించాడు. అయితే నేడు ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాగా, మూవీ ఎలా […]

 Authored By sandeep | The Telugu News | Updated on :3 June 2022,10:00 am

Vikram Movie Review : విలక్షణ నటుడు, లోకనాయకుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ విజయ్ సేతుపతి, సూర్య ముగ్గురు కలిసి లీడ్ రోల్స్ చేసిన మూవీ విక్రమ్.. ఈ సినిమా జూన్ 3న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పెద్ద హీరోలు నటించడంతో విక్రమ్ మూవీపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఖైదీ వంటి చిత్రాన్నితెర‌కెక్కించిన లోకేష్ ఈ చిత్రాన్ని కూడా అద్భుతంగా తెర‌కెక్కించాడు. అయితే నేడు ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాగా, మూవీ ఎలా ఉంద‌నేది చూద్దాం.

క‌థ‌ : విక్ర‌మ్ సినిమాని చాలా గ్రిప్పింగ్‌గా తెర‌కెక్కించాడు లోకేష్ క‌న‌గ‌రాజ్. అరుణ్ కుమార్ విక్రమ్ (కమల్ హసన్) రిటైర్డ్ రా ఏజెంట్ గా సినిమాలో క‌నిపించారు. మాస్క్ మాన్ పేరుతో నగరంలో అనేక కిడ్నాప్‌లు జరుగుతున్నందున, ఆ సమయంలో అమర్ (ఫహద్ ఫాసిల్) ఒక పోలీసు అధికారి, అతను ముసుగు మనుషులను పట్టుకోవడానికి దర్యాప్తు ప్రారంభిస్తాడు మరియు ఆ ప్రక్రియలో, అతను సంతానం (విజయ్ సేతుపతి) అనే గ్యాంగ్‌స్టర్ గురించి తెలుసుకుంటాడు. అయితే కిడ్నాప్‌ల‌కి సంతానంతో సంబంధం ఉంద‌ని విక్ర‌మ్ తెలుసుకుంటాడు. ఓ ర‌హ‌స్య మిష‌న్ ద్వారా వీటిని తెలుసుకోగా, ఈ మిషన్ ఏమిటి మరియు ముసుగు వేసుకున్న వ్యక్తి ఎవరు? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

vikram movie review and rating in telugu

vikram movie review and rating in telugu

విశ్లేష‌ణ‌ : మంచి ఇంట్రడక్టన్ సన్నివేశంతో లోకనాయకుడు కమల్ హాసన్ ఎంట్రీ ఇస్తారు. కమల్ పాత్ర ఎంత బలంగా ఉండబోతోందో ఇంట్రడక్షన్ లోనే చెప్పేస్తారు. స్టైలిష్ యాక్షన్ కి లోకేష్ కనకరాజ్ పెట్టింది పేరు. విక్రమ్ చిత్రం కూడా అదే తరహాలో మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం నెమ్మదిగా మొదలైనప్పటికీ అక్కడక్కడా వచ్చే థ్రిల్స్ మెప్పిస్తాయి. విజయ్ సేతుపతి ఇంట్రడక్షన్ అయితే అదిరిపోతుందనే చెప్పాలి. అద్భుతంగా విజయ్ పాత్రని లోకేష్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ చిత్రంలో కార్తీ ఖైదీ మూవీ కథ, పాత్రలు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఫస్ట్ హాఫ్ ని దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఎంగేజింగ్ గా తీర్చిదిద్దారు.

ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ కి అయితే థియేటర్ లో పూనకాలే . బెస్ట్ ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ గా చెబుతున్నారు. అయినప్పటికీ లోకేష్ పూర్తి కథని ఫస్ట్ హాఫ్ లోనే రివీల్ చేయడం లేదు. స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. విక్రమ్ అసలు సిసలైన లోకేష్ కనకరాజ్ మూవీ అని ఫ్యాన్స్ అంటున్నారు. సినిమాటోగ్రఫీ ప్రతి షాట్ లో కట్టిపడేసే విధంగా ఉంది. ఇక అనిరుద్ కూడా బిజియంతో చెలరేగిపోయాడు. కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నప్పటికీ విక్రమ్ చిత్రం ఓవరాల్ గా బావుందని అంటున్నారు. సెకండ్ హాఫ్ ప్రారంభంలో సినిమా నెమ్మదించినట్లు అనిపిస్తుంది. ఆ తర్వాత ట్విస్టులు రివీల్ కావడంతో వేగం పుంజుకుంటుంది. లోకేష్ కనకరాజ్ అద్భుతమైన యాక్షన్, థ్రిల్స్, ట్విస్ట్ లతో మాయ చేసారు అనే చెప్పాలి. ఓవరాల్ గా విక్రమ్ విశ్వ‌రూపం ప్రదర్శించాడు అని అంటున్నారు.

ప్ల‌స్ పాయింట్స్ :

క‌మ‌ల్‌, విజ‌య్ సేతుప‌తి న‌ట‌న‌
గ్రిప్పింగ్ స‌న్నివేశాలు
అనిరుధ్ మ్యూజిక్

మైన‌స్ పాయింట్స్ :

ఫ‌స్టాఫ్ కొద్దిగా స్లోగా సాగ‌డం
ఫ్యామిలీ ఆడియన్స్‌కి విసుగు తెప్పించే స‌న్నివేశాలు

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది