Gold Facts : బంగారం ఎలా తయారవుతుంది.? మీకు తెలియని రహస్యాలు.!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Gold Facts : బంగారం ఎలా తయారవుతుంది.? మీకు తెలియని రహస్యాలు.!!

Gold Facts : భారతీయులకి బంగారానికి విడదీయలేని బంధం ఉంటుంది. మన వారి దగ్గర ఎంత బంగారం ఉంటే అంత స్టేటస్ గా భావిస్తుంటారు. మన నిత్యజీవితంలో అంతర్భాగం అయిపోయిన బంగారానికి అంత విలువ ఎలా వచ్చింది. అసలు బంగారం ఎలా ఏర్పడుతుంది. బంగారాన్ని మనం తయారు చేయగలమా? బంగారం కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? తదితరు ఆసక్తికరమైన విషయాలు ఈ తెలుసుకుందాం. ఎప్పుడూ లిమిటెడ్ గా ఉండే దానికి ఎక్కువ డిమాండ్ అండ్ వాల్యూ ఉంటుంది. […]

 Authored By aruna | The Telugu News | Updated on :27 February 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Gold Facts : బంగారం ఎలా తయారవుతుంది.? మీకు తెలియని రహస్యాలు.!!

Gold Facts : భారతీయులకి బంగారానికి విడదీయలేని బంధం ఉంటుంది. మన వారి దగ్గర ఎంత బంగారం ఉంటే అంత స్టేటస్ గా భావిస్తుంటారు. మన నిత్యజీవితంలో అంతర్భాగం అయిపోయిన బంగారానికి అంత విలువ ఎలా వచ్చింది. అసలు బంగారం ఎలా ఏర్పడుతుంది. బంగారాన్ని మనం తయారు చేయగలమా? బంగారం కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? తదితరు ఆసక్తికరమైన విషయాలు ఈ తెలుసుకుందాం. ఎప్పుడూ లిమిటెడ్ గా ఉండే దానికి ఎక్కువ డిమాండ్ అండ్ వాల్యూ ఉంటుంది. ఇదే ప్రిన్సిపాల్ బంగారం విషయంలోనూ అప్లై అవుతుంది. బంగారం అనేది అంత ఈజీగా ఏర్పడే ఎలిమెంట్ కాదు.. ప్రస్తుతం మన ఒంటి మీద ఉన్న బంగారం ఇప్పుడు పుట్టింది కాదు.. సూర్యుడు భూమి ఏర్పడకముందే బంగారం తయారై రెడీగా ఉంది. అది ఎలా అంటే ఏదైనా ఒక పెద్ద నక్షత్రం పేలినప్పుడు సూర్యుడు మధ్య భాగంలో ఉండే వేడి కంటే కొన్ని వేల రెట్లు వేడి ఉత్పన్నమవుతుంది. అంత పీడనం ఏర్పడినప్పుడు దాన్లో నుంచి హైడ్రోజన్ హీలియం అంటే మూలకాలన్నీ కలసి బంగారం వంటి పార్టికల్స్ ఏర్పడతాయి. అలా ఏర్పడిన గోల్డ్ పార్టికల్స్ ఈ నక్షత్రం యొక్క పేలుడు దాటికి విశ్వంలోని నలుమూలనకు విసిరివేయబడ్డాయి. ఇలా విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఈ గోల్డ్ పార్టికల్ భూమి ఏర్పడినప్పుడు కొన్ని భూమిలో కలిసిపోయాయి ఇలా భూమిలో అంతర్భాగమైన గోల్డ్ పార్టికల్స్ కొన్ని భూమి మధ్యలోకి వెళ్లిపోతే కొన్ని మాత్రం భూమి పొరల్లో నిక్షిప్తమై ఉన్నాయి.

అయితే ఇలా భూమి పొరల్లో బంగారం దాగి ఉన్న ప్రదేశాన్ని కనుక్కొని అక్కడి నుంచి దాన్ని వెలికి తీయడం కూడా అంత సులభమేమి కాదు.. భూమిలో కొన్ని కిలోమీటర్ల లోపల ఉన్న బంగారాన్ని కనిపెట్టి అక్కడ ఒక మెట్రిక్ టన్ను గోల్డ్ ఓర్ని తవ్వితే దాని నుండి కేవలం 6 నుంచి 8 గ్రాముల బంగారం మాత్రమే బయటికి వస్తుంది. ఇప్పటివరకు 1,90,000 టన్నుల బంగారాన్ని వెలికి తీసారని ఒక అంచనా.. 250 నాటికి భూమి పై పొరల్లో ఉన్న బంగారం మొత్తం అయిపోతుందని నిపుణులు చెప్తున్నారు. అందుకే మన శాస్త్రవేత్తలు వేరే గ్రహాలు గ్రహ శకలాల పైన బంగారాన్ని అన్వేషించడం మొదలుపెట్టారు. బంగారానికి ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఇది మిగతా లోహాలు లాగా వెంటనే రియాక్ట్ అవదు. లైక్ చేసిన ఆక్వార్జి అనే ద్రవంలో బంగారం కరుగుతుంది. అలాగే పాదరసంలో కూడా బంగారం కరుగుతుంది. బంగారం పాదరసంలో కరగడం వల్ల ఏర్పడిన మిశ్రమ ధాతువును రసం మిశ్రమలోహము లేదా నవనీతం అంటారు.అయితే బంగారం కొనేటప్పుడు వ్యాపారులు చెప్పేది విని మోసపోకుండా ఈ మార్పు చూసి కొనుగోలు చేయాలి. బంగారం నాణ్యతను గీటురాయితో చెక్ చేస్తారు. బంగారం బారలోహం కావున ప్యూర్ గోల్డ్ కాయిన్ పైకి ఎగరేస్తే కింద పడినప్పుడు మెత్తని శబ్దం వస్తుంది. అదే అలా కింద పడినప్పుడు ఎక్కువ శబ్దం వస్తే దానిలో మిగతా లోహాలు కలిసాయని అర్థం చేసుకోవాలి. ఒక కాసు లేదా సవరం బంగారం అంటే 8 గ్రాములు. తులం బంగారం అంటే 11.6 గ్రాములు దేశ విదేశాల రాజకీయ సామాజిక ఆర్థిక పరిస్థితులు బంగారం ధర పైన ప్రభావం చూపిస్తాయి. పరిస్థితులన్నీ సక్రమంగా ఉంటే ఇన్వెస్టర్లు బంగారం పైన ఇన్వెస్ట్ చేయడం మానేసి స్టాక్ మార్కెట్ ని ఎంచుకుంటారు. అప్పుడు బంగారానికి డిమాండ్ తగ్గి ధర తగ్గుతుంది.

అదే ఏదైనా సంక్షేపం ఎదురైనప్పుడు రిస్క్ చేయకుండా ఇన్వెస్టర్లు బంగారం పైన ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు బంగారానికి డిమాండ్ పెరిగి ధర పెరుగుతుంది. అధికారిక లెక్కల ప్రకారం ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారంలో 11% వరకు మన ఇండియాలోనే ఉంది. అంటే సుమారుగా మన దేశంలో 24 వేల టన్నులు ఉందన్నమాట.. ఇంకా లెక్క కందకుండా నిధులు నిక్షేపాలు నేలమాలు మరింత బంగారం నిక్షిప్తమై ఉంది. బంగారం తయారు చేయాలంటే విశ్వం ఆవిర్భావం అప్పుడున్న పరిస్థితులు ఏర్పడాలి. అంత పీడనం సృష్టించాలి. ఇప్పుడున్న టెక్నాలజీతో అది సాధ్యం కాదు.. కొన్ని ఆకుల పసరుతో బంగారం తయారు చేసే విద్య మన ఋషుల వద్ద ఉందని చెప్తారు. ఈ విద్య గురించి కొన్ని రహస్య తాళపత్ర గ్రంధాల్లో ఉందట. కొన్ని ఆకుపచ్చ ఆకులను రాగి పైన పూస్తే రాగిలో కెమికల్ రియాక్షన్ జరిగి బంగారంగా మారుతుందట..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది